గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడంతో మంత్రులు కూడా రాజీనామా చేసినట్లయింది. గుజరాత్ లో ఇటీవలే ఎన్నికలు జరిగాయి. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి విజయ్ రూపానీ రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. అయితే నూతన సర్కార్ ఏర్పడేంత వరకూ ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రూపానీని గవర్నర్ కోరారు.
గుజరాత్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా, గుజరాత్ కొత్త సీఎంగా ఎవరనే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ఎవరనే విషయం ఆదివారం తెలుస్తుందని, ఆ మర్నాడు గుజరాత్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరుతుందని బీజేపీ వర్గాల సమాచారం.
