ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంటుంది .అందులో భాగంగా నిన్న మొన్నటి వరకు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన చిన్న చితక నేతల దగ్గర నుండి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరకు చేసే పలు అక్రమాలు ,అవినీతి కార్యక్రమాలపై అటు సామాన్య ప్రజలే కాకుండా ఇటు పలు రాజకీయ పార్టీలకు చెందిన బడా బడా నేతలు వరకు విరక్తి చెందారు .అందులో భాగంగా వలసలు ఇప్పుడు వైసీపీ వైపు మళ్ళాయి .గతంలో పల్నాడు లో తీవ్ర ప్రభావం చూపే మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి వైసీపీ లో చేరి పల్నాడు లో టీడీపీ పై సమరశంఖం పూరించాడు.
ఆ తర్వాత శిల్పా బ్రదర్స్ ఇలా పలువురు వైసీపీ గూటికి చేరారు ..రేపో మాపో కర్నూలు కు చెందిన కోట్ల కుటుంబం కూడా వైసీపీ గూటికి రానున్నది అని అప్పట్లో వార్తలు కూడా తెగ చక్కర్లు కొట్టాయి .తాజాగా మరో కాంగ్రెస్ మాజీ ఎంపీ వైసీపీ లో చేరడానికి సిద్ధమయ్యారు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపూరం కాంగ్రెస్ మాజీ ఎంపీ అయిన టి హర్షకుమార్ తాజాగా విశాఖపట్నం జిల్లాలోదళిత మహిళపై టీడీపీ నేతలు చేసిన దాడిని ఖండిస్తూ ఆయన మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని దళితులపై దాడులకు తెగబడుతున్నారు .రాష్ట్రంలో మహిళలకే రక్షణ లేకుండా పోతుంది .
అసెంబ్లీ సాక్షిగా మహిళ ఎమ్మెల్యేపై దాడికి దిగడమే కాకుండా తాజాగా తమ అన్యాయాలను అక్రమాలను ఎదిరించిన ఒక దళిత మహిళపై ఇలా అమానుషంగా దాడికి దిగడం యావత్తు దళిత సామాజిక వర్గంపై జరిగిన దాడిగా ఆయన అన్నారు .ఒకవైపు ప్రజలకు రక్షణ లేకుండా చేస్తూ మరోవైపు గత ఎన్నికల్లో ఇచ్చిన రుణాల మాఫీ దగ్గర నుండి ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలను గంగలో తొక్కి రాక్షస పాలనను కొనసాగిస్తోంది ..రాష్ట్రంలో టీడీపీ సర్కారు అవినీతి అక్రమపాలనపై నిత్యం పోరాడుతోన్న వైసీపీ అధినేత జగన్ కు అండగా ఉండవలసిన సమయం ఆసన్నం అయింది .దీనిపై త్వరలోనే జగన్ తో మాట్లాడి నిర్ణయం తీసుకొంటా అని చెప్పడం ఈ మాజీ ఎంపీ వచ్చే సంక్రాతి పండగ పర్వదినాన వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయం అని అటు ఈ మాజీ ఎంపీ అనుచర వర్గం ..ఇటు వైసీపీ నేతలు అంటున్నారు .అయితే ఇప్పటికే కాపు సామజిక వర్గానికి దూరమైనా బాబు సర్కారు ఈ మాజీ ఎంపీ వైసీపీలో చేరికతో ఉభయ గోదావరి జిల్లాలో దళితులకు దూరం కావడమే కాకుండా వైసీపీ పార్టీకి బలంగా మారుతుంది అని అంటున్నాయి రాజకీయ వర్గాలు..