తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి ఫొటోలు, వీడియో బయటకు వచ్చాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు ముందు ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. సుమారు 70 రోజుల పాటు జయలలిత అపోలో హాస్పటల్‌లో చికిత్స పొందారు. అన్నాడీఎంకే అధినేత జయ హాస్పటల్లో గ్లాస్‌లో పండ్లరసం తాగుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. అపోలో ఆసుపత్రిలో జయ చేరిన అనంతరం ఆమెను ఎవరూ కలవలేదనే ఆరోపణలపై స్పందించిన టీటీవీ దినకరన్ మద్దతుదారుడు పీ వెట్రివేల్ ఈ వీడియోను విడుదల చేశారు.
மறைந்த முன்னாள் முதலமைச்சர் ஜெ. மருத்துவமனையில் சிகிச்சை பெறும் காட்சி வெளியீடு #jayalalithaa #JayalalithaaVideo https://t.co/AS78qMDz3U … pic.twitter.com/PBhn8fr4Wj
— Dinakaran (@dinakaranonline) December 20, 2017