చాలా మంది కొత్త హీరోయిన్లు ఫోటో షూట్‌తోనే పడగొట్తేన్నారు. ఒక వేళ ఛాన్స్‌లు తగ్గితే మాత్రం సీరత్ కపూర్ తరహాలో బికినీ ఫోటో షూట్ చేసి వెంటనే పాపులర్ అయిపోతున్నారు. అయితే, ఇప్పుడు అర్జున్‌రెడ్డి హీరోయిన్ ఫోటో షూట్‌లను చేయలేదుకానీ.. ఆమె గ్లామరస్ లుక్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. షాలిని పాండే తెలుగులో నటించిన తొలి చిత్రం అర్జున్‌రెడ్డిలో పెదాల ముద్దులతో రెచ్చిపోయిన ఈ భామ.. ఇకపై ఇటువంటి సీన్లు ఉన్న చిత్రాల్లో నటించనని మీడియాకు చెప్పుకొచ్చింది.
అయితే, ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన అవార్డుల ప్రధానం కార్యక్రమంలో పాల్గొన్న షాలినీపాండే తన అందాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రత్యేకమైన డిజైన్ కలిగిన ఓ డ్రస్‌ను వేసుకొచ్చిన షాలినీపాండే తన సొగసులతో ఆ ఫంక్షన్‌లో మెరుపులను మెరిపించింది.
అర్జున్‌రెడ్డి చిత్రంతో యూత్‌కు బాగా కనెక్ట్ అయిన ఈ భామ మరోసారి హాట్‌హాట్‌గా కనిపించడంతో ఫిదా అయిపోయారు. ఈ హాట్ భామ ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తుండగా.. తెలుగు మాత్రం మహానటి సనిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఫంక్షన్‌లో పాల్గొన్న షాలినీపాండేను చూసిన వారంతా జూనియర్ ఛార్మి అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. తెలుగులో అవకాశాలను పెంచుకునేందుకు.. తన అందాలను ఆరబోస్తుందేమోనని కామెంట్లు చేయడం సినీ జనాల వంతైంది.