నూతనంగా ఏర్పడి అనేక సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశ పెడుతూ అభివృద్ధి పధంలో దుసుకేళ్ళుతున్న తెలంగాణ రాష్ట్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. మున్సిపాలిటీల్లో పాలన, ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధిపై ఇచ్చే స్కోచ్ అవార్డ్స్ లో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. అత్యధికంగా 11 అవార్డ్స్ దక్కించుకున్నది. డ్రై రిసోర్స్ వేస్ట్ మేనేజ్మెంట్ లో సిరిసిల్ల మున్సిపాలిటీని గుర్తించారు. క్లీన్ అండ్ గ్రీన్ కింద చెత్తను సేకరించటం, తరలించటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని కమిటీ అభిప్రాయపడింది. హరితహారం, సాలిడ్ వేస్టే మేనేజ్ మెంట్ లో సిద్ధిపేట మున్సిపాటీ గుర్తింపు తెచ్చుకున్నది. సిటిజన్ సర్వీసెస్, మొబైల్ ఆప్ కు బోడుప్పల్ మున్సిపాలిటీ రెండు అవార్డులు దక్కించుకుంది. రెవెన్యూ మ్యాప్ అనుసంధానానికి నల్గొండ మున్సిపాలిటీకి ఓ అవార్డు తెచ్చుకుంది.
