విన్న , ఏడ్చినా కన్నీళ్లే వస్తాయని ఓ కవి అన్నట్టు ఒక్కోసారి అప్రతిహత విజయాలు సైతం భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. ఎక్కడ 2 రాష్ట్రాలు…ఎక్కడ 19 రాష్ట్రాలు. బీజేపీ విజయ ప్రస్థానం ఇది. తాజాగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విజయఢంకా మోగించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఢిల్లీలో బుధవారంనాడు ఏర్పాటు చేసిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో బీజేపీ విజయ ప్రస్థానం తలుచుకుంటూ భావోద్వోగానికి గురయ్యారు. ఎన్నికల్లో విజయాల పట్ల అమితానందం వ్యక్తం చేశారు.
‘ఇది చాలా పెద్ద విజయం. మనం 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. ఇందిరాగాంధీ హయాంలో కూడా 18 రాష్ట్రాల్లోనే ఆ పార్టీ అధికారంలో ఉంది’ అని మోదీ అన్నారు. 1984 నుంచి 2017 వరకూ బీజేపీ విజయ ప్రస్థానంలో సాధించిన విజయాలు మరువలేనివని, అయితే సాధించిన విజయాలతో నిశ్చంతగా ఉండరాదని, 2018లో వరుసగా పలు ఎన్నికలు ఉన్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత సోమవారంనాడు ఎన్నికల ఫలితాల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు బీజేపీ ఖాతాలోకి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే అధికారానికి పరిమితమైంది. ప్రస్తుతం మిజోరాం, కర్ణాటక, పంజాబ్, మేఘాలయలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.