ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవలే శ్రీనివాస్‌రెడ్డి తండ్రి రాఘవరెడ్డి మృతి చెందిన విషయం విదితమే. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి ఖమ్మం బయల్దేరిన సీఎం.. కల్లూరు మండలం నారాయణపురంకు మధ్యాహ్నం చేరుకున్నారు. ఎంపీ పొంగులేటి నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు ఆయనను పరామర్శించారు.
