బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ అయిన అయిన రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్తలు మళ్లీ జోరుగా వినిపిస్తున్నాయి. ప్రభాష్‌కు, అనుష్కకు పెళ్లి.. ప్రభాస్‌కు భీమవరంకు చెందిన అమ్మాయితో పెళ్లి అంటూ ఇలా రక రకాలుగా వార్తలు సికార్లు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ వార్తలన్నీ ఫేక్ అని తెలిసి రెబల్ స్టార్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. అసలు ప్రభాస్‌పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
ఈ వార్తలు ఇలా ఉండగా..
ఇటీవల కాలంలో మెగా డాటర్ నిహారికకు, ప్రభాస్‌కు పెళ్లంటూ అటు సోషల్ మీడియాలోను, ఇటు యూటూబ్ ఛానెళ్లలోనూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, నిహారిక ఒక మనసు సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం, మరో పక్క తమిళ సినిమాల్లోను నటిస్తుండటంతో ఇక గాసిప్ రాయుళ్లు వారి పెన్నుకు పదునుపెట్టారు. ఆమె గురించి ఏదో ఒక వార్త మీడియాలో ఉండేలా చేస్తున్నారు. అయితే, ఈ వార్తపై మెగాస్టార్ చిరంజీవి మండిపడుతున్నట్లు తెలుస్తోంది. నిహారిక, సాయిధరమ్‌తేజ్ పెళ్లి అంటూ వార్తలు రావడంతో మెగా కుటుంబం అసహనంతో ఉందంట. ఈ వార్తలపై చిరంజవి స్పందించారని, ఆయన ఖండించడంతోపాటు ఇలాంటి గాసిప్ వార్తలు స్ర్పెడ్ అవకుండా చూడాలంటూ చిరంజీవి తన కుటుంబ సభ్యులకు సూచించినట్లు సమాచారం.