నారా చంద్రబాబు నాయుడు హిజ్రాలకు దేవడైపోయారు. అదేంటి చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రేకదా..! దేవుడు ఎప్పుడయ్యారు..! అని అనుకుంటున్నారా..? అవునండి నిజంగానే చంద్రబాబు నాయుడు హిజ్రాలకు దేవుడై పోయాడు. అది కూడా.. ఒకే ఒక్క నిర్ణయంతో..
ఇంతకీ విషయమేమిటంటే..
మొన్నీ మధ్య జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో హిజ్రాలకు సంబంధించి చంద్రబాబు సర్కార్ పలు నిర్ణయాలు తీసుకుంది. హిజ్రాలకు రూ.1,500ల పింఛన్. అలాగే, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది చంద్రబాబు సర్కార్.
చంద్రబాబు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై హిజ్రాలు మాట్లాడుతూ..
ఏపీలో ఉన్న ట్రాన్స్‌జండర్స్ .. చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగ చంద్రబాబు ఫోటోకు పూజా కార్యక్రమాలు జరుపుతున్నాము. పాలాభిషేకం, పూజలు చేయడాన్ని మేము కూడా ప్రారంభించాము, మేము, మా పెద్ద వాళ్లు, కొన్ని సంవత్సరాలుగా పోరాడుతూ పోరాడి .. పోరాడి అలిసిపోయాము. వీరికి పెన్షన్ ఇవ్వాలి. చదువు లేని వారికి మనము ఆర్థికంగా తడ్పాడునందించాలి అంటూ చంద్రబాబు సంచలనమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయం, చంద్రబాబు నాయుడు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో చంద్రబాబుకు కడపలో గుడి కడతామని చెప్పారు.