తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు అప్పట్లో తెగ హడావుడి చేసినా.. ఆ తర్వాత ఎవరూ ఆ ఊసే ఎత్తలేదు. అయితే తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మళ్ళీ చలనం వచ్చిందనే వార్త బయటకి రావడంతో టాలీవుడ్ మరోసారి ఉలిక్కి పడుతోంది. త్వరలోనే ఈ కేసి ఒక కొలిక్కి వచ్చే అవాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అనేకమంది టాలివుడ్ ప్రముఖులను విచారించి.. వారి నుండి బ్లడ్ శ్యాంపిల్స్ , వెంట్రుకలు, చేతి గోళ్ళను తీసుకొని ల్యాబ్‌కు పంపించిన సంగతి తెలిసిందే.
ఇక ఆ తర్వాత చాలా రోజులు కామ్ అయిపోవడంతో ఈ కేసు కూడా.. చాలా కేసుల్లాగే అటకెక్కించారని అనుకున్నారు. అయితే తాజాగా ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఒక వార్త బయటకి రావడంతో సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. డ్రగ్స్ శ్యాంపిల్ పరీక్షల్లో ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని… అతని రక్తంలో మాదకద్రవ్యం అవశేషాలు ఉన్నట్లు పరీక్షలో వెల్లడయినట్లు తేలిందట. దీంతో అతని పై కేసు నమోదు చేసేందుకు అబ్కారీ శాఖ సిద్ధమయిందని సమాచారం. అందులో భాగంగానే న్యాయస్థానానికి కూడా ఫోరెన్సిక్ నివేదిక చేరిందట… అయితే డ్రగ్స్ కేసులో పూరి జగన్నాధ్, రవితేజ, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్ తదితరుల రక్త నమూనాలను సేకరించారు. వీరిలో ముగ్గురు తమ రక్తం, వెంట్రుకలను పరీక్షలకు ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే వీరిలో ఒకరి రక్తంలో మాదకద్రవ్యాల అవశేషాలున్నట్లు పరీక్షల అనంతరం తేలడంతో.. టాలీవుడ్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.