తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర వేదికగా డిసెంబర్ 15 నుండి 19 వరకు జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలకి రాష్ట్రం నుండే కాదు విదేశాల నుండి భాషాభిమానులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుండి తెలంగాణ ప్రభుత్వ౦, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలవర్షం కురిపిస్తున్నారు . ఈ నేపధ్యంలో
I whole heartedly appreciate this wonderful initiative taken by the government to promote Telugu literature & culture with Prapancha Telugu Mahasabhalu Program . Really Proud & Elated pic.twitter.com/qhiXQctCpW
— Allu Arjun (@alluarjun) December 20, 2017
ప్రపంచ తెలుగు మహాసభలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా కొనియాడారు. తెలుగు సాహిత్యం, సంస్కృతిని చాటి చెప్పేందుకు ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం అత్యద్భుతం అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. అంతేకాదు తెలుగు మహాసభలు విజయవంతం కావడంతో తనకి ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని తెలిపాడు .