ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన తిరుపతికి నిత్యం వేలాది మంది దేశ విదేశాల నుంచి భక్తులు చేరుకుంటుంటారు. యాత్రికుల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు కొందరు పురుషులు, మహిళలు ముఠాగా ఏర్పడి తిరుపతి ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, గ్రూపు థియేటర్ పరిసరాలను అడ్డాగా చేసుకున్నారు. యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు.
రెట్‌లైట్ ఏరియాను తలపిస్తున్న తిరునగరి..
తిరుపతిలో పెచ్చుమీరిన వ్యభిచారాన్ని నియంత్రించేందుకు పోలీసులు తరచూ దాడులు చేస్తున్నారు. వ్యభిచార ముఠాలను కటకటాలకు పంపిస్తున్నారు. వారికి సహకరిస్తున్న లాడ్జీల యజమానులను సైతం అరెస్టు చేస్తున్నారు. ఈ ముఠా సభ్యులు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటూ ముందుకు సాగిస్తున్నారు. తరచూ ఆర్టీసీ బస్టాండు ఏరియాలో మహిళలు అధిక సంఖ్యలో చేరుకుని యాత్రికులను ఆకర్షించి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. మరికొంత మంది నివాసాల్లోనే యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలకు తెరతీస్తున్నారు. తమిళనాడు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి గుట్టుచప్పుడు కాకుండా రెగ్యులర్ కస్టమర్లకు వారి ఫొటోలను వాట్సప్‌ల ద్వారా పంపుతూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు యంత్రాంగం దాడులు చేస్తున్నా ఈ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మరోపక్క కొంత మంది పోలీసులు చూసి కూడ వదిలేస్తున్నారు. అంటే వారి వారానికి ఇంత లేదా రోజుకు ఇంత తీసుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు.