సోమవారం విడుదలైన గుజరాత్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ఐదో సారి విజయ డంకా మోగించిన సంగతి తెల్సిందే .ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ తొంబై తొమ్మిది స్థానాలను ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏడు స్థానాలను మిగత మూడు స్థానాలను ఇతరులు గెలుపొందారు .ఫలితాలు వెలువడిన దగ్గర నుండి పోటాపోటిగా సాగిన సమరంలో బీజేపీ విజయం సాధించడం విశేషం .అయితే బీజేపీ పార్టీ గెలవడానికి ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి .
అయితే ప్రధాని మోదీ ఎత్తుకున్న హిందుత్వ వాదం ఎజెండా గెలుపుకు కారణమైంది .అందులో భాగంగా ప్రధాని మాట్లాడుతూ నన్ను అడ్డు తొలగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ తో కుట్రలు చేస్తుంది అని ఆరోపించారు .అంతే కాకుండా కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ఏకంగా పాకిస్తాన్ కు వెళ్లి మరి సుపారీ ఇచ్చారు అని అనడం కూడా ఓటర్లను ప్రభావితం చేసింది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .అంతే కాకుండా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా గుజరాత్ ఎన్నికలపై కుట్రలలో భాగంగా పాకిస్తాన్ వెళ్లి రహస్య సమావేశం నిర్వహించారు అని కూడా ఆయన ఆరోపించారు .
ప్రధాని మోదీ ఆరోపించిన ఈ టాప్ మూడు అంశాలే బీజేపీ గెలుపును ప్రభావితం చేశాయి అని రాజకీయ వర్గాల టాక్ .ఎందుకంటే ఎంతో ఇబ్బంది పెట్టిన జీఎస్టీ ,నోట్ల రద్దు ,నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తాను అని వేయకపోవడం,ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తాను అని ఒక్కసారి కూడా ఇవ్వకపోవడంలాంటి వ్యతిరేకత ఉన్న కానీ బీజేపీ గెలిచిందంటే అదే కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ..