ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై చంద్రబాబు సర్కార్‌ను నిలదీసేందుకు.. ప్రజలకు మరింత దగ్గరైవారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తమ వద్దకు వచ్చిన వైఎస్‌జగన్‌కు తమ సమస్యలను చెప్పుకోవడంతోపాటు అర్జీలను కూడా సమర్పిస్తున్నారు ప్రజలు. నిరుద్యోగులైతే.. తమకు ఇంత వరకు చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, వృద్ధులైతే తమకు పింఛన్ రావడం లేదని, ఇలా వారి వారి సమస్యలను జగన్‌కు అర్జీల రూపంలో తెలుపుతున్నారు ప్రజలు.
కాగా, జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం మారాలలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మారాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నాకన్నా చిన్నోడు.. దరల స్థిరీకరణ నిధి రూ.3వేల కోట్లు పెడతానన్నాడా..? చంద్రబాబు తనకన్నా సీనియర్ అని చెప్పి 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతానన్నారు. సీనియర్, ఎక్స్‌పీరియన్స్ ఉందంటే దాని అర్థం రైతులను వెన్నుపోటు పొడవడంలో కాదు చంద్రబాబు అంటూ ఎద్దేవ చేశారు. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతానన్న చంద్రబాబు పరిపాలనలో ఇంత వరకు రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాలేదన్నారు వైఎస్ జగన్.