ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగా రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొననున్నారు.ఈ క్రమంలో అయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.ఈ సందర్బంగా రాష్ట్రపతి కి గవర్నర్ నరసింహన్ , ముఖ్యమంత్రి కేసీఆర్ , ప్రజా ప్రతినిధులు , ఇతర అధికారులు స్వాగతం పలికారు .
బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం 4.05 గంటలకు రాజ్‌భవన్‌కు వస్తారు. సాయంత్రం 6 గంటలకు రాజ్‌భవన్ నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకొని ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో పాల్గొంటారు. రాత్రి 7.15 గంటల వరకు ఎల్బీస్టేడియంలోనే ఉంటారు. తిరిగి 7.25 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు భోజనం చేసి, అక్కడే బస చేస్తారు.
బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు పలువురిని కలుస్తారు. ఉదయం 10 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో ఉన్న బుద్ద విగ్రహం వద్దకు చేరుకొని నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి 11.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళుతారు. మధ్యాహ్నం 1.55 గంటలకు రాష్ట్రపతిభవన్‌కు చేరుకుంటారు. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది.