గురువును మర్చిపోకుండా కోట్లమంది ముందు సన్మానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పవాడని ప్రముఖ నటుడు నారాయణమూర్తి కొనియాడారు. కేసీఆర్ మహా భాషాభిమాని అని పేర్కొన్నారు. తెలుగు వ్యక్తి కేసీఆర్ భారతదేశ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. జీవితంలో మర్చిపోలేని సంఘటన కేసీఆర్ ప్రసంగమని విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు అన్నారు. ఈ సభతో అందరు తెలుగులో మాట్లాడాలని నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు.
తెలుగు భాష కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేయాలని కోరారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ తెలుగు మహాసభల సందర్భముగా కళాకారులను సన్మానించడం చాల సంతోషంగా ఉందన్నారు. తెలుగు మాస్టర్ అంటే అందరికి తక్కువే.. కానీ తెలుగు చదివినవాడు ముఖ్యమంత్రి కాగలడు, ప్రధాని కాగలాడు గొప్పవాడు కాగలాడని తెలిపారు.
కేసీఆర్ కారణ జన్ముడని ప్రశంసించారు. `తెలంగాణ జాతిపిత, ముద్దు బిడ్డ కావడం కోసమే కేసీఆర్ పుట్టాడు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్బంగా సీఎం కెసిఆర్.. గురువును సత్కరించటం గొప్ప విషయం“ అని అన్నారు. దర్శకేంద్రుడు రాఘవేందర రావు మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు మహా యజ్ఞం లాగా సాగాయన్నారు. తెలుగు భాష తనకు జీవితం ఇచ్చిందని చెప్పారు. తెలుగు భాష కాపాడడం సీఎం కేసీఆర్ వల్లనే అవుతుందని స్పష్టం చేశారు.