ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ఇప్పుడు ఏపీ సర్కార్ గుండెళ్లో రైలు పరుగెత్తేలా చేస్తోంది. నవంబర్ 6వ తేదీన ప్రారంభమైన జగన్ పాదయాత్రకు ఎప్పటికప్పుడు ప్రజాదరణ పెరుగుతోంది. జగన్ అడుగులో అడుగు వేసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు విచ్చేస్తుండటంతో… జగన్ పాదయాత్ర ఇప్పుడు పలు పార్టీలను ఆకర్షిస్తోంది. దీంతో అలెర్ట్ అయిన చంద్రబాబు సర్కార్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించి నివేదికను తెప్పించుకుంటోంది. ఇటు చంద్రబాబు సర్కార్‌తోపాటు అటు మోడీ సర్కార్ పీఎంవో కార్యాలయం కూడా జగన్ పాదయాత్రపై ఓ కన్నేసి ఉంచింది.
ఈ విషయాన్ని స్వయాన బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ సంజయ్ మాయక్ ధృవీకరించారు. ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ పాదయాత్రపై తమకు సమాచారం ఉందని స్పష్టం చేశారు. అలాగే, కాంగ్రెస్ మీడియా ఇన్‌ఛార్జ్ రణ్‌దీప్ కూడా జగన్ పాదయాత్రపై తమకు ఎప్పటికప్పుడు నివేదిక అందుతోందని తెలిపారు. దీనిబట్టిచూస్తుంటే.. జగన్ చేస్తున్న పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి 2019 ఎన్నికల్లో రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.