గుజరాత్ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కఠత రేపినా.. చివరికి కాషాయం గ్యాంగ్‌కి విజయం వరించిన సంగతి తెలిసిందే. అయితే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాషాయ దళం వారు.. అక్కడ 182 స్థానాలకు 150 స్థానాలను సాధిస్తామని పక్కాగా బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే తీరా రిజల్ట్ చూస్తే కేవలం 99 స్థానాలకే బీజేపీ పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి మంచు లక్ష్మీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ట్విట్టర్ ద్వారా వినూత్న రీతిలో కౌంటర్ ఇచ్చారు. ఫౌండ్ దిస్ ఫన్నీ.. అంటూ 182 స్థానాలు ఉన్న గుజరాత్‌లో 150 స్థానాలను అమిత్ షా అడిగారు. అయితే గుజరాత్ ప్రజలు మాత్రం 182 స్థానాల్లో జీఎస్టీ 28 శాతం తీసేసి 99 స్థానాలను మాత్రమే బీజేపీకి ఇచ్చారు. మీరు ఇచ్చిన జీఎస్టీ 28 శాతాన్ని మీరే మరిచిపోతే ఎలా అంటూ ట్వీట్‌లో ప్రశ్నించారు. దేశంలో మీరు ప్రవేశ పెట్టిన జీఎస్టీ ప్రకారమే గుజరాత్ ప్రజలు మీకు ఈ తీర్పును కట్టబెట్టారంటూ మంచు లక్ష్మీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవగా.. లక్ష్మీ కౌంటర్‌కు తోచిన విధంగా రిప్లై ఇస్తున్నారు నెటిజన్లు.
