తెలంగాణ రాష్ట్రంలో గర్భిణుల కోసం 102 పేరిట 200 అంబులెన్సులను సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు.రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండిలో 78 లక్షల 15 వేల ఖర్చుతో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని, ఔట్ పేషెంట్ విభాగాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ … త్వరలో కల్వకుర్తి, ఆమన్ గల్ ప్రభుత్వ ఆసుపత్రుల స్థాయి పెంచుతామని, ఆమన్ గల్ లో పోస్టుమార్టం సెంటర్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 40 డయాలసిస్, 25 ఐసియు లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. పేదప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ ఆసుపత్రులు నెలకొల్పుతున్నామని తెలిపారు. కేసీఆర్ కిట్ తో ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. త్వరలో 2వ ఎఎన్ఎం ల సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.