ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో తెలంగాణలో తెలుగు భాషపై సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైమాట్లడుతూ ….మన భాషను మన యాసను బతికించుకునేందుకే ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. పరాయి పాలకుల కారణంగా మన యాసను మనం మర్చిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో మన భాషకు యాసకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టం కడుతుందన్నారు. తాను తెలుగుభాష ప్రేమికుడినని తెలిపారు. ఇప్పటికే ప్రపంచంలో అనేక భాషలు అంతరిస్తున్నయని.. తెలుగు భాషను సుసంపన్నం చేసుకోవాలని పిలుపునిచ్చారు.