తెలంగాణ రాష్ట్రంలో జహీరబద్ కు చెంధిన ప్రమాద బాధితుడు సధాం అలియాస్ కమురోద్దీన్ కుటుంబ సభ్యులు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు..రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జహీరాబాద్ క్రికెట్ ఆటగాడు సధాం మంత్రి హరీష్ రావు చెసిన ఆర్ధిక సహాయం తో ప్రాణాపాయ స్థితి నుంచి సామాన్య స్థితి కి చేరుకున్నాడు..
కేవలం ఆర్ధిక సహాయం మాత్రమే చేసి ఊరుకోకుండా ప్రతి నిమిషం బిజీ గా ఉండే మంత్రి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి మరీ డాక్టర్ లకు మెరుగయిన వైద్య సహాయం కొరకు ఆదేశాలు ఇచ్చారు…పూర్తిగా కోలుకున్న అతడు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ రోజు హైదరాబాద్ లో మంత్రి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియ జేశారు…ఆతని తల్లీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న తమకు సమయానికి ఆదుకున్న దేవుడు హరిశ్ రావు గారు అని తన కొడుకుకి పునర్జన్మ ప్రసాదించారు అన్ని అన్నారు..జీవితాంతం అధికార పార్టీ కి,హరిశ్ రావు గారికి రుణ పడి వుంటాం అని అన్నారు ..