వ్యక్తిగత దూషణలకు దిగితే భంగపాటు తప్పదని గుజరాత్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.. అంటే కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి పడే ఓట్లు కూడా పడకుండా చేశాయన్నది విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వాళ్లను కట్టడి చేయాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్.., ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వ్యక్తిగత దూషణలకు దిగకుండా నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే వ్యక్తిగత దూషణలకు దిగితే భంగపాటు తప్పదని గుజరాత్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
గుజరాత్ రిజల్ట్ నుండి వైసీపీ అధినేత జగన్ చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందని . కేవలం పాదయాత్ర మాత్రమే కాదు ఎలక్షన్ ఇంజనీరింగ్, పోల్ మేనేజ్ మెంట్ ను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. జగన్ కు ఇప్పుడు పెద్ద బలం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ సేవలను విరివిగా వాడుకోవాలని జగన్ ఇప్పటికే నిర్ణయించారు. అలాగే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను కూడా పార్టీ నేతలు పూర్తిగా వినియోగించుకోవాలంటున్నారు వైసీపీలోని కొందరు నేతలు భావిస్తుండగా.. గుజరాత్ ఎన్నికలకు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పోలికే లేదన్నది మరి కొందరి అభిప్రాయం. గుజరాత్‌లో బూత్ స్థాయిలో బీజేపీ పటిష్టమైన నాయకత్వాన్ని ఏర్పరచుకోవడం వల్లనే గెలుపు సాధ్యమయిందని, పార్టీ కూడా అదే నిర్మాణాన్ని చేయాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రచారంలో కొత్త పోకడలను అవలంబించడం వల్లనే మోడీ పార్టీ అక్కడ విజయం సాధించిందంటున్నారు. ప్రజల్లో మమేకమవుతూ పాదయాత్ర కొనసాగిస్తూనే పార్టీని బూత్ లెవల్లో పటిష్టపర్చేందుకు చర్యలు తీసుకోవాలని వైసీపీ అభిమానులు కోరుతున్నారు. జగన్ పార్టీలో ప్రస్తుత మున్న బలహీనతలను తొలగించుకోవాలని విశ్లేషకులు సైతం సూచిస్తున్నారు.