2017 ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా ఇందులో కలిపి వారిచే ఈ మహాసభలలో సంగీత కచేరీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ తరలివచ్చారు. వచ్చిన తారలందరినీ తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈ సభలో సన్మానించారు. ఈ నేపథ్యంలోనే సన్మానాన్ని అందుకున్నమెగాస్టార్ చిరంజీవి ప్రసగించారు. తెలుగుని మాతృభాష అని ఎందుకు అంటారో ఆయన తెలిపారు. మన ఆలోచన.., మన కల.., ఏ భాషలో అయితే ఉంటుందో అదే మాతృభాష అని తెలిపిన చిరు, ఈ మహాసభలను ఎంతో ఘనంగా నిర్వహించారని తెలుపుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ప్రశంసించారు.
ఇక ఈ సంధర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… అనంతరం తెలుగు గురించి ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ గారు ఈ మహాసభలకు పిలిచేందుకు తమ ఇంటికి వచ్చారని.. అయితే ఆయనకు అవార్డు వచ్చిన సందర్భంగా ఆ సమయంలో ఇంగ్లీష్‌లో విష్ చేశానని తెలిపారు. అయితే వెంటనే అన్నా.. మనం తెలుగు వాళ్లం. స్వచ్ఛమైన తెలుగు కార్యక్రమానికి పిలవడానికి వచ్చిన ఈ సందర్భంలో తెలుగులో మాట్లాడుకుంటే బావుంటుంది కదా.. అని అనగానే నాకు ఒక్కసారిగా చివుక్కుమనిపించింది అని చిరంజీవి తెలిపారు. కేటీఆర్ అలా అనగానే నాలో ఆలోచన మొదలైంది. ఇద్దరు తెలుగు వాళ్లు ఎదురుపడినప్పుడు చక్కటి తెలుగు మాట్లాడకుండా.. ఆంగ్ల భాషని ఎందుకు వాడుతున్నామని అనిపించింది. వెంటనే ఆయనకి క్షమాపణ చెప్పేశాను. లేదు అన్నా.. జస్ట్ జోకింగ్ అని ఆయన అన్నప్పటికీ.. తమాషాగా అన్నా కూడా నాలో వెంటనే ఆలోచనని కలిగించిందని చిరంజీవి తెలిపారు.