హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో నలబై నాలుగు స్థానాల్లో గెలిచి బీజేపీ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది .ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రి పేరును పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ పార్టీ వర్గాలు అంటున్నాయి .అయితే మొదటిగా ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రేమ కుమార్ ఓటమి చవిచూశారు .
దీంతో ఇటు రాష్ట్ర అటు జాతీయ అధిష్టానం కేంద్రమంత్రిని ముఖ్యమంత్రిగా నియమించాలని యోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి .అందులో భాగంగా ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న జేపీ నడ్డా పేరును ఆ పార్టీ అగ్ర వర్గాలు నిర్ణయించినట్లు రాష్ట్ర పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి..