ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోతుంది అని ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఆ పార్టీకి మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు .సోమవారం విడుదలైన గుజరాత్ ,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవడంపై ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు .
ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీకి మెజారిటీ రాదు .అప్పుడు మేమే హీరోలం అవుతాము .మా మద్దతు లేకుండా టీడీపీ సర్కారును ఏర్పాటు చేయలేదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .గుజరాత్ ఎన్నికలు ప్రధాని మోదీ పనితీరుకు నిదర్శనం అని అన్నారు .రాహుల్ గాంధీ కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేశారని ..ఆయన ప్రధాని కావడం ఈ జన్మలో జరగదు అని ఆయన విమర్శించారు ..