Home / ANDHRAPRADESH / బాబోయ్‌.. ”చంద్ర‌బాబుపై క‌త్తి మ‌హేష్ జోకులు” మ‌ళ్లీ పేలాయ్‌..!!

బాబోయ్‌.. ”చంద్ర‌బాబుపై క‌త్తి మ‌హేష్ జోకులు” మ‌ళ్లీ పేలాయ్‌..!!

అవును మీరు చ‌దివింది నిజ‌మే. చంద్ర‌బాబుపై క‌త్తి మ‌హేష్ మ‌ళ్లీ సెటైర్స్ వేశాడు. ప్ర‌స్తుతం మ‌నం నివ‌సిస్తున్న ఈ ప్ర‌పంచాన్ని సృష్టించ‌మ‌ని చెప్పింది చంద్ర‌బాబేన‌ట‌. ఈ మాట ఎవ‌రో చెప్ప‌లేదండి బాబూ.. స్వ‌యాన టాలీవుడ్ క్రిటిక్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బాగా ద‌గ్గ‌రైన క‌త్తి మ‌హేష్ చెప్పారు. ఇంత‌కీ ప్ర‌పంచాన్ని సృష్టించ‌మ‌ని చంద్ర‌బాబు దేవుడికి చెప్ప‌డ‌మేంటీ అనేగా మీ డౌటు.. దీనిపై క‌త్తి మ‌హేష్ ఇచ్చిన క్లారిటీ చ‌దివేద్దాం మ‌రీ.

అస‌లు విష‌యానికొస్తే.. మొన్నీ మ‌ధ్య‌న భాగ్య‌న‌గ‌రం, మ‌హాన‌గ‌రం ఇలా ప‌లు పేర్ల‌తో పిల‌వ‌బ‌డుతున్న హైద‌రాబాద్‌లో మెట్రో రైలు ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. మెట్రో రైలు ప్రారంభాన్ని స్వ‌యాన దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు, ఇత‌ర మంత్రులు అశేష జ‌న‌వాహిని మ‌ధ్య అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించింది తెలంగాణ స‌ర్కార్‌. అయితే, విమానంలో హైద‌రాబాద్‌లో ల్యాండ్ అయిన సమయంలో ప్ర‌ధానికి ఆహ్వానం ప‌లికేందుకు వ‌చ్చిన చంద్ర‌బాబు కాస్త నోరు జారాడ‌ట‌. అదేమిటంటే.. మెట్రో రైలు నావ‌ల్లే వ‌చ్చింది.. అందుకు నేను చాలా కృషి చేశాను అంటూ మీడియా ముందు చిల‌క‌ప‌లుకులు ప‌లికాడ‌ట‌.

ఈ విష‌యం కాస్తా క‌త్తి మ‌హేష్ చెవిన ప‌డ‌టంతో… చంద్ర‌బాబూ.. అన్నీ నీవ‌ల్లనే క‌దా..! ప్ర‌పంచాన్ని సృష్టించ‌మ‌ని దేవుడికి స‌జీష‌న్ ఇచ్చింది కూడా నేనేన‌ని చెప్పేస్తో ఓ ప‌నైపోతుంది క‌దా..! అంటూ చంద్ర‌బాబుపై వెట‌కారం ప్ర‌ద‌ర్శించాడు క‌త్తి మ‌హేష్‌. నేను హైటెక్ సిటీ క‌ట్టించాను. నేను బిల్‌గేట్స్‌ను ర‌ప్పించాను. నేను —, నేను — అన్నీ నీవేనా. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం ఏమీ లేదా అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఒక ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తికి నేను అన్న అహంభావ‌న ఉండ‌టం సిగ్గుచేట‌ని, అత‌ను కేవ‌లం వ్య‌క్తిగానే కాకుండా.. వ్య‌వ‌స్థ‌లా ఆలోచించాల‌ని చంద్ర‌బాబుకు సూచించారు క‌త్తి మ‌హేష్‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat