చిత్తూరు జిల్లాలో ఎయిడ్స్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని అధికారిక గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అధికారిక సమాచారం మేరకు జిల్లాలో ఇప్పటి వరకు 23,343 మంది ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. ఈ ఏడాదిలోనే 3,200 మంది ఎయిడ్స్ వ్యాధిన పడినట్లు తేలింది. తిరుపతితో పాటు రేణిగుంట, సత్యవేడు, మదనపల్లి, కుప్పం తదితర ప్రాంతాల్లో ఎయిడ్స్ రోగుల సంఖ్య అధికంగా ఉన్నట్లు హెచ్చరించారు. జిల్లాలో ఎయిడ్స్ వేగంగా వ్యాప్తి చెందడానికి పైన ప్రస్తావించిన సంఘటనలే నిదర్శనం. సంబంధిత అధికారులు స్పందించి వ్యభిచార ముఠాకు అడ్డుకట్ట వేయకపోతే మరింత మంది ఎయిడ్స్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు