Home / ANDHRAPRADESH / ‘అంత దూరం నుంచి ఎందుకొచ్చావు..ఇబ్బంది కదా?’అని జగన్‌ అంటే…బాలుడు చేప్పిన మాట

‘అంత దూరం నుంచి ఎందుకొచ్చావు..ఇబ్బంది కదా?’అని జగన్‌ అంటే…బాలుడు చేప్పిన మాట

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర(పాదయాత్ర) 38వ రోజు సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలో నడిమిగడ్డ పాల్‌ క్రాస్‌లో ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యి విజయవంతంగా సాగుతున్నది. ఈ పాదయాత్రలో జగన్ ప్రజలపై..చిన్న పిల్లలపై తన అభిమానన్ని స్వయంగా చూపించాడు. రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామానికి చెందిన రాఘవేంద్రగౌడ్‌ కుమారుడు కార్తీక్‌ బళ్లారిలో 8వ తరగతి చదువుతున్నాడు. అతనికి వైఎస్‌ జగన్‌ అంటే ఎనలేని అభిమానం. జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జగన్‌ను కలవాలని, తనను ఆయన వద్దకు తీసుకెళ్లాలని ఇంట్లో వాళ్లను అడుగుతూ వచ్చాడు. ఆదివారం బడికి సెలవు కావడంతో తండ్రి రాఘవేంద్ర గౌడ్, పెదనాన్న మంజునాథగౌడ్‌ కార్తీక్‌ను తీసుకొని పాదయాత్ర జరుగుతున్న ధర్మవరం మండలం తుమ్మల గ్రామం వద్దకు చేరుకున్నారు. విపరీతమైన జనాలు ఉండటంతో జగన్‌ను కలిసేందుకు వీలు కాలేదు. అంతటి జనంలోనూ కార్తీక్‌ తన తండ్రి, పెద్దనాన్నతో కలిసి సుమారు రెండు కిలోమీటర్లు నడిచాడు.

అప్పటికి జగన్‌ను కలిసే అవకాశం వచ్చింది. తన అభిమాన నేతతో ఫొటో తీయించుకున్నాడు. ‘అంత దూరం నుంచి ఎందుకొచ్చావు.. ఇబ్బంది కదా?’ అని జగన్‌ అంటే.. ‘మీరంటే అభిమానం అంకుల్‌’ అని బదులిచ్చాడు. ‘ఏమైనా సమస్యలున్నాయా.. మరేమైనా పని ఉందా?’ అని అడిగితే ‘నాకేమీ అవసరం లేదు. మీరు ముఖ్యమంత్రి కావాలన్నదే నా ఆశ’ అని చెప్పాడు. ఆ తర్వాత మరో మూడు కిలోమీటర్లు జగన్‌ వెంట నడిచి తర్వాత ఊరికి బయలుదేరి వెళ్లాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat