ప్రముఖ సాహితీవేత్త, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఒకానొక సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో చీపురు పనిచేసేందుకు కూడా సిద్ధపడ్డారట. ఈ మాటలు ఎవరో చెప్పినవి కావు. స్వయాన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చెప్పినవే. ఇంతకీ ఆయన చీపురు పనిచేసేందుకు కూడా సిద్ధపడేలా చేసింది ఎవరో కాదండి బాబూ.. స్వయాన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. తనకు ఆ పరిస్థితి వచ్చేందుకు దారితీసిన కారణాలను ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఇంకా ఆయన మాట్లాడుతూ..
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు, హరికృష్ణకు మంచి సంబంధాలు ఉండేవన్నారు. అయితే, 1995లో ఎన్టీఆర్ నుంచి.. చంద్రబాబు అక్రమంగా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చంద్రబాబుకు తన మద్దతు తెలిపారు కూడా. అయితే, ఆ తరువాత తనకు కానుకగా చంద్రబాబు రాజ్యసభ ఇచ్చాడంటూ పలు పత్రికలు వార్తను ప్రచురించాయని, అదంతా అవాస్తవమని చెప్పుకొచ్చారు లక్ష్మీ ప్రసాద్. ఆనాడు తనకు పదవి ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరించడంతో హరికృష్ణ పట్టుబట్టి మరీ తనకు రాజ్యసభ సీటు ఇప్పించారన్నారు. అయితే, ఆ తరువాత రెండో టర్ములో హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరించారన్నారు. హరికృష్ణ పదవిలో లేకుండా నేను పదవిలో ఉటే మంచిది కాదు.. నేను ఆఫీసు ఊడ్చే ఉద్యోగం చేయమన్నా చేస్తా నంటూ తన మనసులోని మాటను చంద్రబాబు ముందు పెట్టానన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నాడని, ఇక అప్పట్నుంచి తనకు, చంద్రబాబుకు మధ్య బాగా గ్యాప్ పెరిగిందని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్.
Tags ANDRA PRADESH hari krishna Nara Chandrababu Naidu yarlagadda prasad