గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజ్‌కోట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయబావుటా ఎగురవేశారు. ఆయనకు గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రానిల్ రాజ్‌గురుపై దాదాపు 21 వేల ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. కౌంటింగ్ మొదలైన తొలి గంటన్నర వరకు వెనుకబడిన ఆయన.. తర్వాత అనూహ్యంగా పుంజుకున్నారు. ఒక దశలో ఇంద్రనిల్ 6234 ఓట్ల మెజార్టీలోకి దూసుకెళ్లినా.. తర్వాత వెనుకబడిపోయారు.ప్రధాని మోదీ సొంతరాష్ట్రంలో ఆయనకున్న ప్రజాభిమానంపై ఇదో పరీక్షగా అందరూ భావించారు. విజయ్ రూపానీపై మోదీ పూర్తి విశ్వాసం నిలపడంతో రాజ్‌కోట్ విజయం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.