వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తామని ఆ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. కాగా, ఆదివారం అనంతపురం జిల్లా.. ధర్మవరం నియోజకవర్గంలో జగన్ తన ప్రజా సంకల్ప పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. అంతేగాక పొదుపు సంఘాలకు, రైతులకు జీరో వడ్డీ రుణాలు ఇవ్వడంలేదని, అయితే మద్యాన్ని మాత్రం ఇంటింటికి సరఫరా చేస్తోందంటూ టీడీపీపై ఫైరయ్యారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతైంతే అప్పు ఉంటుందో.. అంత మొత్తాన్ని నేరుగా మహిళల చేతికే ఇస్తామని, అలాగే, రైతులకు జీరో వడ్డీ రుణాలను పునరుద్ధరిస్తామనీ జగన్ హామీ ఇచ్చారు.
