ప్రస్తుతం కాలంతో పాటు రాజకీయాల్లో మార్పులు వచ్చాయి.. మాటల్లో కూడా మార్పులు వచ్చాయి. విమర్శల స్థానంలో తిట్లు చేరాయి. ఒకరినొకరు విమర్శించుకోవడం మరిచిపోయి.. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా తిట్టుకొనే స్థాయికి చేరాయి. తాజాగా ఈ పరిస్థితి మరీ గోరంగా తయారైంది. గత కొంత కాలంగా కత్తి మహేష్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న ఎదురుదాడిలో ప్రస్తుతం బూతు రాజకీయం నడుస్తుంది. పవన్ ప్యాన్స్ యే రచ్చ రచ్చ చేస్తుంటే.. వీరు ఏంత వరకు దీగజారుతారో అర్థం కావడం లేదు ఎవ్వరికి ..అంతేగాక ఓ లైవ్ ప్రోగ్రాంలో బండ్ల రోజాపై చేసిన ఫోన్ సంభాషణ అందరిని సిగ్గుపడేలా చేసింది.
మరోవైపు విమర్శలను అస్సలు తట్టుకోలేని జనసేన పార్టీ అభిమానుల్లో కొంతమంది రోజా, కత్తి మహేష్ పై విరుచుకుపడుతూనే ఉన్నారు. రోజా, కత్తి మహేష్ లను ఎదురుకోవడంలో ఒకరకంగా జనసేన ఇబ్బంది పడుతుందనే చెప్పుకోవాలి. పవన్ అభిమానులు రెచ్చిపోయి.. అందరి ముందు చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే పవన్ ను ఏదైనా అంటే… ఫ్యాన్స్ ఊరుకోరు.. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా అని మాట్లాడుకునే స్థాయికి వచ్చింది. పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ వల్ల అది ఇంకా తారాస్థాయికి చేరింది. దీంతో పవన్ అభిమానులు ఆయనకు లాభం చేకూర్చడం సంగతేమో కానీ… ఆయనకు నష్టం చేకూర్చడంలో మాత్రం పరోక్షపాత్ర పోషిస్తున్నారు.
Tags పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ రాజకీయం