తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్ఫష్టం చేశారు. ఇవాళ ఆమె ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ నిర్మాణ పనులను ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక యువత ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఐటీ హబ్ పూర్తయితే ఖమ్మంలోనే ఉపాధి దొరుకుతుందని భరోసానిచ్చారు. ఖమ్మంతో పాటు మరో మూడు జిల్లాల్లోనూ ఐటీ హబ్‌లు నిర్మిస్తున్నట్టు తెలిపారు.
Visited IT Hub construction site & TRS party office in Khammam.
Posted by Kalvakuntla Kavitha on Monday, 18 December 2017