కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ఇప్పటికే రాష్ర్టంలో కాక పుట్టించింది. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. గెలుపు కోసం టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి శిల్పామోహన్‌రెడ్డి పోటీ పడగా. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడే ఉండి గెలుపుకోసం ఎన్నో తంటాలు పడి గెలిచారు. ఇక తాజాగా కర్పూలు జిల్లాలో మరో ఉప ఎన్నికకు తెరలేవనుంది. టీడీపీ నుండి ఎమ్మెల్సీగా గెలిచి …తరువాత రాజీనామా చేసి వైసీపీలోకి చేరాడు. దీంతో ఆ స్థానానికి ఎన్నికల సంఘం నోటీఫికేషన్ జారి చేసింది. వాస్తవానికి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల్లో వైసీపీకి పూర్తి బలం ఉంది. కానీ టీడీపీ అప్పుడు అభ్యర్థిని నిలబెట్టింది. ఇప్పుడు తిరిగి అదే రూట్లో ఎమ్మెల్సీ సీటు కైవసం చేసుకోవాలని ఆరాటపడుతోంది. అయితే ఇప్పటివరకూ అభ్యర్థిని నిర్ణయించలేదు. చల్లా రామకృష్ణారెడ్డితో పాటు పలువురు నేతలు ఎమ్మెల్సీ సీటు కోసం తెగ ట్రై చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి కళా వెంకట్రావు ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ప్రలోభాల పర్వంతో మళ్లీ గెలవాలనే ప్లాన్ గీశారు. అయితే ఖర్చు ఎవరు భరిస్తారనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.
అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఖర్చు ఎవరు పెట్టాలనే విషయంపై ఆలోచిద్దామని చంద్రబాబు చెప్పారట. మొత్తానికి అడ్డదారిలో మళ్లీ ఎమ్మెల్సీ సీటు సాధించే ప్రయత్నాల్లో టీడీపీ పడింది.ఇటు వైసీపీ నుంచి చక్రపాణి రెడ్డి బరిలో దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. విలువలకు కట్టుబడి రాజీనామా చేసిన చక్రపాణి రెడ్డి సీటు గెలిచేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఎలాగైనా టీడీపీకి గట్టి కౌంటర్ ఇవ్వాలని వైసీపీ ఆలోచిస్తోంది. కర్నూలు స్థానిక ఎమ్మెల్సీ స్థానానికి ఈసీ షెడ్యూల్ విడుదల చేశారు..దీనికి సంభందించి 19 వ తేదీన అధికారిక నోటిఫికేషన్ ఉంటుంది ఈనెల 26 వరకు నామినేషన్ లు స్వీకరిస్తారు.. వచ్చే సంవత్సరం జనవరి 12న పోలింగ్, 16న కౌంటింగ్