తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. 19న మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు రామ్‌నాథ్ చేరుకుంటారు. అక్కడ్నుంచి రాజ్‌భవన్‌కు చేరుకుని.. సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ రోజు రాత్రి రామ్‌నాథ్ రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు. 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహానికి నివాళులర్పించి.. ఆ తర్వాత ఢిల్లీకి తిరిగి బయల్దేరి వెళ్తారు.