జూ.ఎన్టీఆర్ ఊసరవెల్లిలో చెప్పిన ‘కరెంట్ తీగ కూడా నాలానే సన్నగా ఉంటుంది.. కానీ పట్టుకుంటే దానమ్మ షాకే అనే డైలాగ్ చాలా పాపులర్. ఇప్పుడు మళ్లీ ఆ కరెంట్ తీగ తరహాలో సన్నగా మారడానికి సిద్దమైపోతున్నారట. తాజాగా త్రివిక్రమ్‌తో సినిమా మొదలుకావడంతో.. బరువుపై మరోసారి ఆయన ఆలోచనలో పడ్డారట.యంగ్ టైగర్ ఎన్టీఆర్ 28వ సినిమా అక్టోబర్ నెలలో హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎన్టీఆర్‌పై పవన్ కళ్యాణ్ తొలి క్లాప్ కొట్టారు. సినిమా ఘనవిజయం సాధించాలని, అంతా మంచి జరగాలని పవన్ కోరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు, పవన్ కళ్యాణ్ అభిమానులు యంగ్ టైగర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘పవర్ టైగర్’ అంటూ వీరి కాంబినేషన్‌కు పేరుపెట్టారు. ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ రావడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.అప్పటిలో ఇండస్ర్టీలో హట్ టాపిక్ అయ్యింది.
ఇప్పుడు ఈ సినిమా గురించి మరో హట్ టాపిక్…!
త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా కోసం.. క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఎన్టీఆర్ భారీగా బరువుగా తగ్గాలని నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్ని కిలోలు తగ్గబోతున్నారనే దానిపై క్లారిటీ లేనప్పటికీ.. ఏకంగా 18కిలోలు తగ్గబోతున్నారంటూ ప్రచారం జరుగుతుండటం గమనార్హం. యమదొంగ టైమ్‌లో: ఎన్టీఆర్ ఫిజిక్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. ‘యమదొంగకు ముందు.. ఆ తర్వాత’ అనే మాట్లాడుకోవాలి. అప్పటిదాకా బొద్దుగా కనిపించిన ఆయన.. అప్పటినుంచి నిజంగానే కరెంట్ తీగలా సన్నగా మారిపోయారు. అభిమానులు కూడా ఎన్టీఆర్‌ను ఒక్కసారిగా అలాంటి కటౌట్‌లో చూడటానికి మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా.. ఆ తర్వాత కనెక్ట్ అయిపోయారు. ‘ఊసరవెల్లి’లో కరెంటు వైర్ డైలాగ్ మరీ అంతలానా?: ప్రస్తుతం ఎన్టీఆర్ వెయిట్ అంత భారీగా ఏమి లేదు. అలాంటిది ఏకంగా 18కిలోలు తగ్గిపోతే.. ఫిజిక్‌లో దారుణమైన మార్పులు రావడం ఖాయం. కాబట్టి బయట ప్రచారంలో ఉన్నట్లు ఎన్టీఆర్ అంత భారీగా బరువు తగ్గడం జరగకపోవచ్చు. త్రివిక్రమ్ ఎలా చూపిస్తారో!: టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన పవన్, మహేష్, ఎన్టీఆర్ లలో ఒక్క ఎన్టీఆర్‌తో మాత్రమే తివిక్రమ్ సినిమా బాకీ పడిపోయాడు. ‘అతడు’లో మహేష్ క్యారెక్టర్‌ను తివిక్రమ్ తీర్చిదిద్దిన తీరును ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. అలాగే జల్సాలో పవన్ కల్యాణ్ పాత్ర కూడా అభిమానులను ఉర్రూతలూగించింది. ఆ ఇద్దరు స్టార్స్‌ను ఓ రేంజ్‌లో చూపించిన త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రను ఎలా డిజైన్ చేయబోతున్నారన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందులో భాగంగానే.. ఎన్టీఆర్‌కు బరువు తగ్గమని సలహా ఇచ్చారంటే.. దాని వెనుక మతలబేంటో?..ఎలా చూపిస్తారో వేచి చూడలి మరి
