వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజల పై కురిపిస్తున్న హామీల వర్షంలో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో పాదయాత్రలో ఉన్న జగన్ తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పెన్షన్లు వెయ్యి నుంచి రెండువేల రూపాయలకు పెంచుతామని, నిరుద్యోగ భృతి చేనేతలకు 45 ఏళ్ళకే పెన్షన్లు, విద్యార్థులకు భారీ ఉపకార వేతనాలు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో వరం ప్రకటిస్తూ టీడీపీకి కలవరాన్ని మిగులుస్తున్నారు వైసీపీ అధినేత. కొత్త కొత్త హామీలు పధకాలు ప్రకటిస్తూ ప్రభుత్వ తీరును ఎక్కడికక్కడ ఎండగడుతూ సాగిపోతున్నారు జగన్.
అయితే ఆచరణ సాధ్యం కాని హామీలతో వైసీపీ అధినేత ఎలా ప్రజలను మభ్యపెడతారని ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించడంతో రాష్ట్రం అప్పులఊబిలో ఉందని ఆయన ఇచ్చే హామీలు నమ్మొద్దంటూ యనమల స్థాయిలో ప్రచారం ఊపందుకుంది అంటే టీడీపీ ఏ స్థాయిలో భయపడుతుందో అందరికీ అర్ధమవుతోందని.. మరి గత ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు ఎలాంటి హామీలు ఇచ్చారో.. అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎలా హ్యాండ్ ఇచ్చారో అందరికీ తెలుసని.. అయితే జగన్ పాదయాత్రలో భాగంగా ఇస్తున్న హామీలు కేవలం అధికారం కోసం మాత్రమే కాదని.. ప్రజలు అనుభవిస్తున్న సమస్యల నుండే ఆయన హామీలు పుట్టుకొస్తున్నాయని.. ఆ హామీలు వారి హక్కు అని.. ఆ హామీలను చూసి టీడీపీ నేతల మైండ్ బ్లాక్ అవుతోందని.. అందులో భాగంగానే యనమల బుర్రతక్కువ వ్యాఖ్యలు చేశారని జగన్ దెబ్బకి టీడీపీ బ్యాచ్ మొత్తానికి భయం పట్టుకుందని విశ్లేషకులు సైతం అబిప్రాయ పడుతున్నారు.