మంద కృష్ణ మాదిగ పెట్టిన ప్రతి సభ విద్వంసం చేసి మాదిగల పేరు చెడగొడుతున్నాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవయ్య మాదిగ మండిపడ్డారు. శాంతియుతంగా వర్గీకరణపై ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంను బదనం చేసేందుకు రాష్ట్రపతి పర్యటన అడ్డు కోవాలని చూస్తున్నాడని మండిపడ్డారు. తాను ఒక్కడే ఎదగాలని కార్యకర్తలను తొక్కిపెట్టాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవయ్య ఆరోపించారు. వర్గీకరణ విషయంలో ఎంత మందిని చంపాలని మందకృష్ణ మాదిగ చూస్తున్నాడని ఆరోపించారు. నిన్న అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని… హింసను ప్రేరేపించిన వారిపై పీడీ యాక్ట్ కేస్ పెట్టాలి కఠినంగా శక్షించాలని డిమాండ్ చేశారు.
టీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు భాస్కర్ యాతకుల మాట్లాడుతూ మాదిగల ఆత్మగౌరవాన్ని మందకృష్ణ మాదిగ తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. మాదిగ జాతి హక్కుల కోసం 23 ఏండ్లు ఉద్యమాలు చేశామన్నారు. కృష్ణ మాదిగ ఉనికి కోల్పోతున్నాననే భావనతో నిన్న సంస్మరణ సభ పెట్టాడని ఆరోపించారు. మంద కృష్ణ మాదిగ శవ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. మా జాతి హక్కులు కోసం ప్రభుత్వంతో దగ్గరగా ఉండి మా హక్కులను సాదించుకుంటున్నామన్నారు. “మేము ఎవ్వరికి అమ్ముడు పోము ఎవ్వరికి ఓటు వేయమని చెప్పలేదు చెప్పం“.. అని ఆయన స్పష్టం చేశారు. మాదిగ యువకుల కోసం చదువు చెప్పించడo కొరకు టీ ఎమ్మార్పీఎస్ ప్రయత్నం చేస్తున్నామన్నారు.
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేయాలని కోరుకుంటున్నామన్నారు. మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని తెలిపారు. రాష్ట్రపతి అందులో దళితుడు రాష్ట్రపతి ఉన్న సమయంలో సిగ్గుచేటని మండిపడ్డారు. “ప్రపంచ తెలుగు మహాసభలు అడ్డుకోవడం వెనుక ఉన్న నీ రాజకీయ కుట్ర ఏమిటో బయటపెట్టాలి. తెలంగాణ ద్రోహులు చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ లో పర్యటన చేసినపుడు వారికి రక్షణ నిలపడ్డాడు. జనవరి లో మాదిగల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేస్తాం` అని స్పష్టం చేశారు. తాము ఎవరికి వ్యతిరేకం కాదని…చెప్పు డప్పుకు 2,000 ఇవ్వాలని గవర్నర్, సీఎం అపాయింట్ మెంట్ కోరుతున్నామన్నారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.
Post Views: 287