Home / ANDHRAPRADESH / దావుడా! ఈ క‌త్తి.. చంద్ర‌బాబునూ వ‌ద‌ల్లేదు..!!

దావుడా! ఈ క‌త్తి.. చంద్ర‌బాబునూ వ‌ద‌ల్లేదు..!!

మ‌హేష్ క‌త్తి. ప్ర‌స్తుతం సినీజ‌నాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మ‌రీను. అయితే, మ‌హేష్ క‌త్తి మొద‌ట‌గా సినీ విశ్లేష‌కుడిగాను, ద‌ర్శ‌కుడిగాను, అలాగే బిగ్‌బాస్(తెలుగు) మొద‌టి సీజ‌న్‌లో పాటిస్పేట్ చేసిన‌ప్ప‌టికీ రానంత క్రేజ్ ప‌వ‌ర్ స్టార్‌పై, జ‌న‌సేన పార్టీపై చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా సెల‌బ్రెటీ అయిపోయాడు. ప‌వ‌న్ అభిమానులు ప్ర‌శ్నిస్తే, మ‌న‌ది ప్ర‌జాస్వామ్య దేశం, ఇక్క‌డ అంద‌రికి వారి వారి భావాల‌ను చెప్పుకునే అవ‌కాశం ఉంటుంది. నా భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను అడ్డుకునే హ‌క్కు మీకెక్క‌డిది..? అని ప్ర‌శ్నిస్తుంటారాయ‌న‌.

అయితే, ఇటీవ‌ల కాలంలో క‌త్తి మ‌హేష్ సినీ న‌టుల‌పైనే కాకుండా.. రాజ‌కీయ నేత‌ల‌పై కూడా విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నాడు. ఏదో ఒక సంద‌ర్భానుసారంగా మాట్లాడుతూ..దేశ ప్ర‌ధాని నుంచి గ‌ల్లీ నాయ‌కుడిపై త‌న‌దైన శైలితో విమ‌ర్శ‌లు, ప్ర‌శ్న‌లు గుప్పిస్తూ ఎప్పుడూ వార్త‌ల్లోకెక్కుతుంటాడు. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో జ‌ర‌గ‌బోయే నిర్మాణాలకు సంబంధించిన కొన్ని డిజైన్ల‌ను నార్మ‌న్ పోస్ట‌ర్ అనే కంపెనీ త‌యారు చేసిన అసెంబ్లీ హాలు డిజైన్ల‌ను చూసిన చంద్ర‌బాబు దాదాపు ఖ‌రారు చేశారు. ఆ డిజైన్‌లో అసెంబ్లీ సెంట్ర‌ల్ హాల్‌లో తెలుగుత‌ల్లి విగ్ర‌హం ఉంది. అయితే, ఈ డిజైన్‌పై మీ సూచ‌న‌లు తెల‌పండి అంటూ చంద్ర‌బాబు నాయుడు రాజ‌మౌళిని కోరారు. డిజైన్‌ను ప‌రిశీలించిన రాజ‌మౌళి ఉద‌యం 9 గంట‌ల‌కు తెలుగుత‌ల్లి విగ్ర‌హం కాళ్ల‌పై సూర్య‌కిర‌ణాలు ప‌డేలా చూడాల‌ని సూచించార‌ట‌.

ఈ విష‌యం కాస్తా.. క‌త్తి మ‌హేష్ చెవిన ప‌డ‌టంతో తెలుగుత‌ల్లి విగ్ర‌హం కాళ్ల‌పై ప‌డ‌క‌పోతే న‌ష్ట‌మేమ‌న్నా ఉందా..? అంటూ రాజమౌళిని ప్ర‌శ్నిస్తూ ఫేస్‌బుక్‌లో కామెంట్ పెట్టాడు. దీంతో ఈ కామెంట్ కాస్తా వైర‌ల్ అయింది. అయితే, కొంత‌మంది ఈ విష‌యంపై క‌త్తి మ‌హేష్‌కు మ‌ద్ద‌తు తెలుపుతుంటే.. మ‌రికొంద‌రు వ్య‌తిరేకిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat