గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. క్షణ క్షణానికి అధిక్యం తారుమారు అవుతూ నువ్వా-నేనా అన్నట్టు కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ తన హవాను కొనసాగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కొంత ఆధిక్యతను కనపరుస్తోంది. గంట క్రితం కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. మళ్ళీ పుంజుకొని బీజేపీ రేసులోకి వచ్చింది. 104 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 76 స్థానాల్లో కాంగ్రెస్, మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. క్షణక్షణానికి ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఇక సూరత్ లోని పది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. సూరత్ ఎన్నికలపై జీఎస్టీ ప్రభావం పడుతుందని భావించారు. కాని సూరత్ లో బీజేపీ ఆధిక్యత కనపర్చడం విశేషం. దక్షిణ, మధ్య గుజరాత్ లో బీజేపీ ఆధిక్యం కనపరుస్తోంది.