రాహుల్ గాంధీ గాలిలో తిరిగి చెప్పిన గాలి మాటలు గాలిలోనే కొట్టుకుపోయాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు . గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు.గుజరాత్‌లో బీజేపీ విజయానికి కార్యకర్తలు ఎంతో కృషి చేశారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ ఫథకాలను బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారన్నారు.గుజరాత్‌లో అభివృద్ధి ఎజెండానే తప్ప ఎలాంటి జిమ్మిక్కులు పనిచేయలేదని లక్ష్మణ్ అన్నారు. జీఎస్టీ, పెద్దనోట్లపై కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. భవిష్యత్‌లో బీజేపీ తెలంగాణలో పాగా వేస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
