మరికొద్దిసేపట్లో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఓటర్ల తీర్పు వెలువడనుంది. అయితే, ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ టెక్కింపు టీ 20 మ్యాచ్‌ను తలపిస్తోంది. నిమిషానికి.. నిమిషానికి ఓటర్ల తీర్పు మారుతున్న నేపథ్యంలో ఓటర్ల తీర్పు ఎవరివైపు ఉందో అన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనావేయలేకపోతున్నారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల లెక్కింపు అందుబాటులో ఉన్న ట్రెండ్స్ మేరకు బీజేపీ 97 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా, కాంగ్రెస్ 81 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇతరులు మూడు స్థానాలలో ముందంజలో ఉన్నారు.
అయితే, తాజా సమాచారం మేరకు గుజరాత్ విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తల్లకిందులయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెనుకంజలో ఉండగా, ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ స్వల్ప ఆధిక్యత కనబరుస్తున్నారు. ఏదేమైనా మరికొన్ని గంటల్లో హిమాచల్, గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్ భవితవ్యమేంటనేది తేలనుంది.