మొన్నటి వరకు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై అన్ని విధాలా సందర్భానుసారంగా విమర్శల దాడి చేస్తూ చివరికి ఆయన అభిమానులను, జనసేన పార్టీని సైతం విడిచిపెట్టకుండా తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమ్మతోడు ఇక పవన్ కల్యాణ్ జోలికి రానంటున్నాడు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించాడు కత్తి మహేష్.
అయితే, తాజాగా.. తన ఫేస్‌బుక్‌లో లైవ్ నిర్వహించిన మహేష్ కత్తి మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం పొలిటికల్ సెటైర్స్ అనే టైటిల్‌పై ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నానని తెలిపాడు. ఆ చిత్రం జనవరి నుంచి ప్రారంభమవుతుందని, అందువల్ల ప్రస్తుతం ఉన్న సమస్యలన్నింటికీ చరమగీతం పాడి, తన సినిమా చిత్రీకరణపైనే తన కాన్సట్రేషన్ మొత్తాన్ని ఉంచుతానన్నాడు. ఇంత వరకు తనకు ఇతరుల నుంచి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నేను నిలబడగలిగాను.. ఆ సందర్భంలో తనకు అండగా నిలిచిన మీకు కృతజ్ఞతలు అంటూ ఫేస్‌బుక్ వేదికగా కత్తి మహేష్ ప్రకటించారు.