Home / MOVIES / ఒక్క సినిమా షాలిని పాండే తలరాత మార్చింది .

ఒక్క సినిమా షాలిని పాండే తలరాత మార్చింది .

టాలీవుడ్ లో మొదట వివాదాలతో మొదలై ఆ తర్వాత బంపర్ హిట్ సాధించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు ఆ మూవీలో మంచి మార్కులే పడ్డాయి .తెలంగాణ రాష్ట్రానికి చెందిన యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ తో కల్సి నటించిన ఈ మూవీ మొదట విమర్శల పాలైన కానీ ఆ తర్వాత జక్కన్న దగ్గర నుండి విమర్శకుల వరకు అందరి మన్నలను అందుకుంది .

ఇలాంటి మూవీలో నటించిన అమ్మడు పాండేకు ఇప్పుడు అవకాశాల మీద అవకాశాలు తన్నుకు వస్తోన్నాయి .ఇప్పటికే ఆమె సావిత్రి జీవితం ఆధారంగా వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మహానటి’లో నటిస్తుంది . ఈ మూవీతో పాటుగా షాలిని ‘100% లవ్‌’ తమిళ్‌ రీమేక్‌లో తమన్నా పాత్రకు కూడా సంతకం చేశారు. అయితే తాజాగా మరో అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చినట్లు చిత్ర వర్గాల సమాచారం.ఇటివల వచ్చిన ‘ఓకే బంగారం’ ఫేం దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఒక చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం దర్శక, నిర్మాతలు షాలినిని సంప్రదించినట్టు సమాచారం .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat