దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రతిహతంగా . దూసుకెళుతోంది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలే కాకుండా మరెన్నో కార్యక్రమాలను చేపట్టి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అగ్రగామిగా నిలిచారు. ప్రభుత్వం ఏర్పాటైన మూడేళ్ళ కాలంలోనే 365 పథకాలను అమలు చేసిన ఘనతను కేసీఆర్ సొంతం చేసుకున్నారు. 36 మాసాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. ముఖ్యంగా ఇంటింటికి శుద్ధనీరు ఇవ్వాలన్న ధ్యేయంతో కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ, చెరువుల మరమ్మతులకు చేపట్టిన మిషన్ కాకతీయ పథకాలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రభుత్వం ఏర్పాటైన రోజునుంచే తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా చేయాలన్న సీఎం కేసీఆర్ కలలు నిజమవుతున్నాయి.
సమాజంలోని అన్ని వర్గాలకు చేయూతనిచ్చి అడిగిందే తడవుగా ఆయా వర్గాలకు పథకాలను అమలు చేస్తున్న ఘనత కూడా సీఎం కేసీఆర్‌కే దక్కింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా మెట్రోరైల్ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించి సీఎం కేసీఆర్ శభాష్ అనిపించుకున్నారు. త్వరలోనే రెండో విడత మెట్రోరైల్ ప్రారంభానికి అవసరమైన పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాదిన్నర కాలంలో మరిన్ని నూతన పథకాలకు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. పంచాయితీరాజ్ వ్యవస్థను పటిష్టంచేసే దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే నూతన పంచాయితీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు భారీ ఎత్తున నిధులను వెచ్చిస్తున్న సంగతి తెలిసిందే. పాలనను ప్రజల ముంగిటకు తీసుకువెళ్ళాలన్న లక్ష్యంతో గత ఏడాది దసరా రోజున 21 కొత్త జిల్లాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా లక్షా 8వేల ఖాళీల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైద్య ఆరోగ్యశాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న సీఎం కేసీఆర్ ఆరువేలకుపైగా వైద్యుల ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టింది. గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టంచేసే దిశగా చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఈ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు భారీగా నిధులు వెచ్చిస్తోంది. దేశానికి రైతే వెన్నుముకఅనే నానుడిని నిజం చేయాలని ఏడాదికి రైతు పంటలు వేసుకునేందుకు రూ.8వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిజాం కాలంలో భూ సర్వే చేపట్టారని భూములకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం దగ్గర ఆశించిన స్థాయిలో లేవని ఒక నిర్ణయానికి వచ్చిన సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని భూములను పరిశీలించి వాటి నివేదికలు తెప్పించే పనిలో నిమగ్నమయ్యారు.
రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా ప్రతి గ్రామంలో వ్యవసాయాధికారిని నియమించి వారు ఎటువంటి పంటలు పండించాలి, గిట్టుబాటు ధరలు ఎలా ఇప్పించాలన్న అంశంపై ప్రభుత్వం వీరిని నియమించి వారిద్వారా సలహాలు, సూచనలు చేస్తోంది. బలహీన వర్గాలతో పాటు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబుద్ధులు నేర్పించేందుకు రాష్ట్రంలో భారీ ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలతో పాటు జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నడుం బిగించింది. వైద్యవిద్యను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఇప్పటికే సిద్దిపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో త్వరలోనే మరో రెండు వైద్య కళాశాలలను ప్రభుత్వరంగంలో ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పేదింటి పిల్లల వివాహాలను జరిపించేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబంలో వెలుగులు నింపేందుకు సీఎం కేసీర్ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను చేపట్టి దేశంలోనే అగ్రగామిగా నిలిచారు. మిగతా రాష్ట్రాలు కూడా ఈ తరహా పథకాలను అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చాయి. ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల వివాదానికి కూడా కేసీఆర్ పరిష్కారమార్గం చూపించారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్యం తమ ప్రథమ కర్తవ్యమని భావించిన ప్రభుత్వం వారికోసం ప్రత్యేకంగా వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతంలో అమలైన జోనల్ విధానానికి గుడ్‌బై చెప్పింది. పురపాలక సంఘాల్లో ఉంటున్న ప్రజలకు కేవలం రూపాయికే మంచినీటి కనెక్షన్‌ను అందించి తమది పేదల సంక్షేమ ప్రభుత్వంగా కేసీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారు.
వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు సన్నబియ్యంతో మూడు పూటలా భోజన వసతి కల్పిస్తోంది. నకిలీ ఎరువులు, విత్తనాలు, పాలు తదితర ఆహార పదార్థాలను కల్తీచేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వారి భరతం పట్టేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వం అటువంటి వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభలో చట్టం కూడా తీసుకువచ్చింది. కొత్త సంవత్సరం రోజున రాష్ట్రంలోని రైతాంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో గృహావసరాలకు ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ను ఇప్పటికే అందిస్తోంది. బీసీ సంక్షేమానికి పెద్దపీట వేయాలని భావించిన ప్రభుత్వం త్వరలోనే బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. గొర్రల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రాష్ట్రంలో యాదవులు, కురవలకు 70 శాతం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తుండగా, మత్స్యకారులకు వందశాతం సబ్సిడీతో చేప పిల్లలను అందిస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో కల్లు దుకాణాలను పునరుద్ధరించడంతో పాటు రజకులు, నాయీ బ్రాహ్మణులకు చేయూతనిస్తోంది. నాయీ బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్లకు గృహావసరాలకు ఇచ్చే విద్యుత్ టారిఫ్‌ను అమలు చేయాలని, బీసీ విద్యార్థులు విదేశీ విద్యకోసం ఆయా దేశాలకు వెళితే వారికి ఆర్థికసాయం చేయాలని ఇందుకోసం మహాత్మా జ్యోతిబాపూలే పేరుతో ప్రభుత్వం విద్యానిధిని ఏర్పాటు చేసింది. ప్రతి పేదవాడికి ఉండడానికి ఇల్లు కల్పించాలన్న ధ్యేయంతో ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు శ్రీకారం చుట్టింది. సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.25వేల కోట్లను కేటాయించిన ప్రభుత్వం ప్రాజెక్టుల ఆకృతులను మార్చి కోటి ఎకరాలకు నీరందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంపై ఎల్లెడలా హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోని పేరొందిన పారిశ్రామికవేత్తలు ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని స్వాగతించి రాష్ట్రంలో భారీఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రథమ ధ్యేయమని తరచూ చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పోలీస్ శాఖకు భారీఎత్తున నిధులు కేటాయించడంతో పాటు పోలీసుల సంక్షేమానికి పెద్దఎత్తున పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇటీవలె వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కుకు శ్రీకారం చుట్టింది.
మూడేళ్ళలో 36 మాసాల్లో తెలంగాణ ప్రభుత్వం 365 పథకాలకు శ్రీకారం చుట్టింది. ఆ పథకాలివే.
———————————————————————————
సంక్షేమ కార్యక్రమాలు
ఆదాయ పరిమితి పెంపు, ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులకు భృతి, కల్యాణలక్ష్మీ/షాదీ ముబారక్, వడదెబ్బ మృతులకు అపద్బందు, ప్రకృతి వైపరీత్యాలు మృతులకు రూ.5 లక్షలు, మునిసిపాలిటీల్లో రూపాయికే నల్లా కనెక్షన్, ఎకనమిక్ సపోర్టు
స్కీమ్ సబ్సిడీ పెంపు
———————–
జర్నలిస్టులు, న్యాయవాదులు, ఇతర వర్గాల సంక్షేమం
———————————————-
న్యాయవాదులకు రూ.100 కోట్లు, ప్రభుత్వ లాయర్ల గౌరవ వేతనం పెంపు, ట్రాక్టర్, ఆటోలపై రవాణాపన్ను రద్దు, జర్నలిస్టుల సంక్షేమానికి రూ.50 కోట్లు, పేద బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100 కోట్లు, తెలంగాణ అమరవీరులకు రూ.10 లక్షలు, ఉద్యో గం, జర్నలిస్టులు, హోంగార్డులు, డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికు లకు రూ.5లక్షల ప్రమాదబీమా, గీత, మత్స్య కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి చర్యలు
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం
———————–
దళితులకు మూడెకరాల భూమి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు, టిఎస్ ప్రైడ్, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రగతి నిధి, తెలంగాణలో 62శాతం రిజర్వేషన్లు, గ్రామ పంచాయితీలుగా గిరిజన తండాలు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీలకు నేరుగా నిధులు, ఎస్టీల కోసం చల్లప్ప కమీషన్.
మైనారిటీ సంక్షేమం
———————–
మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్లు, గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం, ఉపకార వేతనాలు, ఓన్ యువర్ ఆటో, మొదటి లాంగ్వేజ్ ఆప్షన్‌గా ఉర్దూ భాష, ఉర్దూలో నీట్ నిర్వహణ, మైనారిటీ శాఖలో ఉద్యోగాల భర్తీ, ప్రత్యేక వక్ఫ్‌బోర్డు ఏర్పాటు, సుధీర్ కమీషన్, ఇమామ్, మౌజంలకు రూ.1000 భృతి, ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్, ఉర్దూలో ప్రత్యేక డిఎస్సీ.
బీసీ సంక్షేమం
———————–
బీసీ కమీషన్, ఎంబిసి ఫైనాన్స్ కార్పొరేషన్, బీసీలకు 119 ఆశ్రమ పాఠశాలలు, గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమాభివృద్ధికి మంత్రివర్గ ఉపసంఘం, 75శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ, 100 శాతం సబ్సిడీతో చేప పిల్లల పెంపకం, చేనేత కార్మికుల సంక్షేమం, కల్లు దుకాణాల పునరుద్ధరణ, రజకులకు, నాయీ బ్రాహ్మణులకు చేయూత, పవర్‌లూం కార్మికులకు రుణాలు మాఫీ, సెలూన్లకు గృహ కేటగిరి విద్యుత్, మహాత్మా జ్యోతిబాపూలే బీసీ విదేశీ విద్యానిధి.
ఉద్యోగుల సంక్షేమం
———————–
ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్, పదవీ విరమణ రోజునే పెన్షన్, కారుణ్య నియామకాలు, ఉద్యోగుల బదిలీలు, పదోన్న తులపై నిషేధం ఎత్తివేత, ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెం ట్, ఉద్యోగులు, జర్నలిస్టులకు వెల్‌నెస్ సెంటర్లు, ఏకీకృత సర్వీస్ రూల్స్‌కు ప్రభుత్వం ఆమోదం, జోనల్ విధానం రద్దు, ఐకేపీ ఉద్యో గులకు వేతనాలు పెంపు, 776 మంది గురుకుల టీచర్ల సర్వీసుల క్రమబద్దీకరణ, భాషా పండితులను, పీఈటీలను స్కూల్ అసి స్టెంట్లుగా పదోన్నతి, ఉద్యోగులకు, పెన్షనర్లకు హెల్త్‌కార్డులు, వీఆర్‌ఏల జీతాలు 64.61 శాతం పెంపు, వీఏవోల వేతనంపెంపు, జల మండలి ఉద్యోగుల వేతన సవరణ, కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల వేతనాల పెంపు, సకల జనుల సమ్మె కాలం ప్రత్యేక సెలవు, ఔట్స్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ, కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలు 100శాతం పెంపు, నరేగా, సెర్ప్ ఉద్యోగుల వేతనాలు పెంపు, 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్.
ఆర్టీసీ, విద్యుత్, సింగరేణికి చేయూత
———————————-
ఆర్టీసీకి రూ.750 కోట్లు, ఉద్యోగులకు 44శాతం ఫిట్‌మెంట్, ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక ఇంక్రిమెంట్, కార్మికులు మరణిస్తే అంత్య క్రియలు ఇచ్చే సాయం రూ.20వేలకు పెంపు, విద్యుత్‌శాఖ ఉద్యోగు లకు 27.5 శాతం ఫిట్‌మెంట్, విద్యుత్ ఉద్యోగులకు పీఆర్‌సీ, విద్యుత్‌శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ.
నీటి పారుదల
———————–
మిషన్ కాకతీయ, జీయో ట్యాగింగ్, ఫీడర్ ఛానల్స్, తెలంగాణ జల సమగ్ర వినియోగ విధానం, బడ్జెట్‌లో సాగునీటి పారుదలశాఖకు రూ.25వేల కోట్లు, సమగ్ర మైనింగ్ విధానం, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పూర్తి, ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వకు మరమ్మతులు, ఉపరితల ఓడరేవులు, ప్రాజెక్టుల రీడిజైనింగ్, నల్గొండ జిల్లా కాల్వల పునరుద్ధరణకు రూ.285 కోట్లు మంజూరు, కాళేశ్వరం, సీతారామ భక్తరామదాసు ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందాలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం, ప్రాజెక్టుల నుంచి మంచినీరు, పరిశ్రమలకు నీరు.
మౌలిక సదుపాయాలు
———————–
కొత్తల్లేని విద్యుత్ సరఫరా, మిగులు రాష్ట్రంగా తెలంగాణ, మిషన్ భగీరథ, తెలంగాణకు హరితహారం, రవాణా రహదారులు, భవనాలు, జాతీయ రహదారుల విస్తరణ, హైదరాబాద్‌శివార్లలో రీజినల్ రింగ్‌రోడ్డులు, రూ.8వేల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం, తెలంగాణ రూరల్ రోడ్డు డవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, వాగులు, వంకలు, రైల్వేలైన్లపై వంతెనలు, మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వేలైన్ ఏర్పాటు.
విద్యార్థుల సంక్షేమం
———————–
ఫీజు రీయింబర్స్‌మెంట్, రెసిడెన్షియల్ స్కూళ్ళ ఏర్పాటు, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, విదేశీ విద్యకు ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్, విద్యార్థులకు మెస్ ఛార్జీల పెంపు, ప్రభుత్వ స్కూళ్ళలో ఆంగ్ల మాధ్యమంలో బోధన, ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్ తరగతులు, గజ్వేల్‌లో ఎడ్యుకేషన్ హబ్‌కు రూ.104 కోట్లు, హైదరాబాద్‌లో ఏరో వర్సిటీ, బాల్కొండలో స్పైస్ బోర్డు, వరంగల్‌లో వ్యవసాయ కళాశాల, మామనూరులో వెటర్నరీ కళాశాల, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్ళ ఏర్పాటు, వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీ, మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు, అంతిమ యాత్ర వాహనాలు, వరంగల్‌లో గిరిజన విశ్వవిద్యాలయం, వరంగల్‌లో సైనిక స్కూల్, కొత్తగా ఏడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, నిజామాబాద్‌లో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల.
వైద్య ఆరోగ్యశాఖ
———————–
శాశ్వత పోలియో పరిష్కారం, అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి పెంపు, కేంద్ర, ఏరియా ఆసుపత్రుల్లో 20 ఐసీయూ కేంద్రాల ఏర్పాటు.
పరిశ్రమలు
———————–
పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ, టిఎస్ ఐపాస్, సింగిల్ విండో పారిశ్రామిక విధానం, జహీరాబాద్‌లో నివ్జ్‌ు, తరలివస్తున్న పరిశ్రమలు, రంగారెడ్డి జిల్లాలో జాతీయ ఫార్మాకోపియా కమీషన్, రూ.250 కోట్లతో అమ్యూజ్‌మెంట్ పార్కు, టిఎస్ ప్రైమ్, టిఎస్ ప్రైడ్ ఏర్పాటు, ఫార్మాసిటీ ఏర్పాటు, స్థిరాస్తి రంగంపై వరాలు, వరంగల్ టెక్స్‌టైల్ పార్కు, రియల్ ఎస్టేట్ రంగానికి చేయూత, రాయితీలు, రూ.270 కోట్లతో 9 లెదర్ పార్కులు, ఆటోమొబైల్ రంగం అభివృద్ధి.
ఇతర సంక్షేమ కార్యక్రమాలు
—————————–
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, తెలంగాణ రాష్ట్రం ప్రణాళికా సంఘం ఏర్పాటు, మాసాయిపేట దుర్ఘటనలో ప్రభుత్వ స్పందన, అమల్లోకి కొత్త భూసేకరణ చట్టం, సీఎం నూతన అధికారిక నివాసం ప్రగతి భవన్, ఏపీ సచివాలయం భవనాలు తిరిగి ఇవ్వాలని కోరుతూ తీర్మానం, విభజన సమస్యల పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కమిటీ, సమగ్ర సామాజిక కుటుంబ సర్వే, దుబ్బాకపై వరాలు, యువతకు ట్రాక్టర్ల పంపిణీ, పెరిగిన రాష్ట్ర వృద్ధిరేటు, నాలా పనులు తగ్గింపు, సమగ్ర పౌర సమాచార నిధి, పట్టణ సర్వీసుల ఏకీకృతం, గ్రేటర్ వరంగల్ ఏర్పాటు, కరీంనగర్ సమగ్రాభివృద్ధికి చర్యలు, స్థానిక ప్రజా ప్రతినిధుల జీతాల పెంపు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు పెంపు, సమీకృత జిల్లా కలెక్టరేట్లు, గోల్కొండలో స్వాతంత్య్ర దినోత్సవం, ఫుట్‌పాత్ వ్యాపారులకు సహాయం, అమరవీరుల స్మృతిచిహ్నం.
జిహెచ్‌ఎంసి
———————–
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం, హైదరా బాద్‌లొ ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ఎస్‌ఆర్‌డిపి ఏర్పాటు, హైదరాబాద్ నాలుగు వైపుల ఎక్స్‌ప్రెస్ హైవేలు, మెట్రోరైల్ ప్రాజెక్టు, స్వచ్చ హైదరాబాద్, హరితహారం, పారిశ్రామిక కాలుష్యరహిత హైదరాబాద్ ఏర్పాటు, మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు, పేదల విద్యుత్ బకాయిల మాఫీ, జీవో నెంబర్ 58 ప్రకారం లక్షా 25వేల మంది ఇళ్ళ పట్టాలు, హైదరాబాద్‌లో పేదల నల్లా నీటి బకాయిల మాఫీ, రూ.5కే పేదలకు కడుపునిండా భోజనం, ఆస్తిపన్ను తగ్గింపు, మినహాయింపు, ఈ-ఆఫీస్ నిర్వ హణ, డీపీఎంఎస్ ఏర్పాటు, మై జిహెచ్‌ఎంసి యాప్, ఎల్‌ఈడీ లైట్లు, మోడల్ మార్కెట్ల నిర్మాణం, క్రీడారంగం అభివృద్ధి, డ్రైవర్లకు సొంత కార్లు, జిహెచ్‌ఎంసి కార్మికుల వేతనాలు పెంపు, నీటి అవస రాలు తీర్చడానికి రెండు రిజర్వాయర్లు, స్మార్ట్ హైదరాబాద్‌కు శ్రీకా రం, సిస్కోతో ఒప్పందం, ఏసీ మెట్రో లగ్జరీ బస్సులు, వరంగల్, బెంగళూరు, విజయవాడ మార్గాలకు ఎలివేటెడ్ కారిడార్లు.
పంచాయితీరాజ్
———————–
గ్రామజ్యోతి, మన ఊరు – మన ప్రణాళిక, పల్లెప్రగతి, మనఊరు – మన కూరగాయలు.
సాంస్కృతికం, క్రీడలు, పర్యాటకం
———————————–
తెలంగాణ సాంస్కృతిక సారధి, చలనచిత్ర పురస్కారాలకు తెలంగాణ పేరు, ఓయూ శతాబ్ది ఉత్సవాలు, ప్రపంచ తెలుగు మహాసభలు.
ఆలయాల అభివృద్ధి
———————–
వేములవాడ, యాదగిరిగుట్ట, దేవాలయాల అభివృద్ధి, యాదాద్రికి ఎంఎంటిఎస్, భద్రాద్రి డెవలప్‌మెంట్ అథారిటీ, నాగార్జునసాగర్ బౌద్ధక్షేత్రం అభివృద్ధి, అధికారికంగా తెలంగాణ పండుగలు, తెలంగాణ పండులకు అధికార హోదా, బతుకమ్మ రికార్డు, బక్రీద్, రంజాన్, క్రిస్మస్‌లకు రెండు రోజుల సెలవు, దేవాదాయ అర్చకులకు వేతన వ్యవస్థ, తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలు, తెలంగాణ మొక్కులు, ప్రభుత్వ దేవాలయాలకు సమర్పించనున్న అభరణాలు, తెలంగాణ శాస్త్రా, సాంకేతిక మండలి ఏర్పాటు, అతిపెద్ద జాతీయ జెండా, తెలంగాణ అవతరణ దినోత్సవ ఉత్సవాలు, మహిళా దినోత్సవం నిర్వహణ, జూన్ 2న ప్రభుత్వ ఆవిర్భావ దినోత్సవం.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి)
——————————
డిజిటల్ తెలంగాణ, ఐటి పాలన, టీ-హబ్, ఇంక్యుబేటర్. టిఎస్‌పిఎస్సీ ఏర్పాటు, కొత్త ఉద్యోగాల భర్తీ.
శాంతిభద్రతలు, పోలీస్ సంక్షేమం
——————————-
హోంగార్డుల జీతాల పెంపు, ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య అలవెన్స్, పోలీస్ వ్యవస్థ ఆధునీకరణ, జైళ్ళ సంస్కరణలపై సబ్‌కమిటీ, నగరంలో టాస్క్‌ఫోర్సులు, పోలీసులకు కొత్త వాహనాలు, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నూతన భవనం, కొత్తగా పోలీస్ కమీషనరేట్లు, గిన్నీస్ బుక్‌లోకి వరంగల్ పోలీస్ కమీషనరేట్, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో 10శాతం పోలీసులకు, పోలీస్ స్టేషన్ల నిర్వహణ వ్యయం భారీగా పెంపు, పోలీస్ అమరవీరుల ఎక్స్‌గ్రేషియా పెంపు, సైనికుల సంక్షేమానికి ప్రాధాన్యత, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో రిజర్వు బెటాలియన్, 15వేల పోలీసు ఉద్యోగాల భర్తీ, పోలీస్ శాఖ నియామకాల్లో వయోపరిమితి మూడేళ్ళ సడలింపు.
తెలంగాణ ప్రముఖులకూ అధికారికంగా జయంతి, వర్ధంతి
——————————————————
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచారి, నవాబ్ అలీ నవాజ్ జంగ్, ఈశ్వరీబాయి, జి.వెంకటస్వామి జయంతి, వర్ధంతి, కొమరంభీమ్ వర్ధంతి, కొండా లక్ష్మణ్ బాపూజీ.
మహిళా, శిశు సంక్షేమం
—————————–
ఆరోగ్యలక్ష్మీ పోషకాహారం, ఐసిడిఎస్ సిబ్బందికి శిక్షణా తరగతులు, దీపం పథకం, అమ్మఒడి పథకం, అంగన్‌వాడీల జీతాలు 150శాతం పెంపు, ఆశావర్కర్లు జీతాలు రూ.6వేలకు పెంపు, ప్రసవానికి రూ.12వేల ఆర్థిక సహాయం, కేసీఆర్ కిట్లు, ఒంటరి మహిళలకు రూ.1000 భృతి, శ్రీనిధి, 10 లక్షల వరకు వడ్డీలేని రుణం, షీ టీమ్స్, మహిళా రక్షణ మిషన్.
సాంఘిక సంక్షేమం
———————-
విద్యార్థులకు సన్నబియ్యం, ఆరు కిలోల బియ్యం
వ్యవసాయం, రైతు సంక్షేమం
——————————
రుణమాఫీ, సకాలంలో ఎరువులు, విత్తనాలు, నకిలీ, కల్తీకి పాల్పడే వారిపై పీడీ చట్టం, రైతులకు ఉచితంగా ఎరువుల పంపి ణీపై ప్రతి ఎకరాకు రూ.8వేలు, పసుపుసాగు, సైన్స్ పార్కు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ఏర్పాటు, ఆయిల్‌పాం సాగు, ఇంటర్నెట్ ద్వారా వ్యవసాయ సమాచారం, భూసార పరీక్షలు, సాదా బైనామాలు, 11 లక్షల మంది, హెచ్‌ఎండిఎ, కుడా పరిధిలోని వ్యవసాయ భూములకు సాదాబైనామా, ప్రతి ఐదువేల ఎకరా లకు ఒక వ్యవయాధికారి, రాష్ట్రీయ కృషి వికాస యోజన ఏర్పాటు, మైక్రో ఇరిగేషన్, గ్రీన్‌హౌస్ ఏర్పాటుకు 75శాతం సబ్సిడీ, ఫాం మెకనైజేషన్ కోసం రూ.420 కోట్లు కేటాయింపు, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు, రామగుండం ఎరువుల పరిశ్రమ పునరుద్ధరణ, హార్టికల్చర్ కార్పొరేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్, అటవీ కళాశాల, మూడు వ్యవసాయ పాలిటెక్నిక్‌లు, ఇన్‌పుట్ సబ్సిడీ, ఎర్రజొన్న రైతులకు రూ.9.5 కోట్లు, గోదాముల నిర్మాణం, రైతులకు వడ్డీలేని రుణం, మార్కెట్లలో సద్దిబువ్వ రూ.5కే భోజనం, మార్కెట్లలో హామాలీల కూలీరెట్ల పెంపు, గ్రీన్‌హౌస్ సబ్సిడీ, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా, కొత్తగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు, విత్తన భాండాగారంగా తెలంగాణ, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, మార్కెట్ యార్డు, కార్మికులకు వరాలు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షలు.
విద్యాసంస్థలకు తెలంగాణ ప్రముఖుల పేర్లు
———————————————
వ్యవసాయ విశ్యవిద్యాలయానికి ఆచార్య జయశంకర్ పేరు, హెల్త్ యూనివర్సిటీ కాళోజీ నారాయణరావు పేరు.
జాతరలు, పుష్కరాలు
ఘనంగా గోదావరి, కృష్ణా పుష్కరాలు, మేడారం జాతరకు ఏర్పాట్లు, దూపదీప నైవేద్యం పథకం, దూపదీప నైవేద్యం నిధుల పెంపు, అర్చకులకు రూ.8వేల కనీస వేతనం, కొత్తగా పర్యాటక విధానం.
ప్రముఖుల పేరిట భవనాలు
దొడ్డి కొమురయ్య కురుమ మెమోరియల్, బంజారా ఆదివాసీలకు హైదరాబాద్‌లో భవన నిర్మాణం, అర్చకులకు ప్రత్యేకంగా బ్రాహ్మణ భవన్, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు, అజ్మీర్ దర్గా వద్ద రూ.5 కోట్లతో వసతి గృహం, శబరిమల లో 5 ఎకరాల స్థలం, హైదరాబాద్‌లో కేరళ భవన్, రూ.5 కోట్లతో లింగాయత్ భవన్, క్రిస్టియన్ భవన నిర్మాణానికి రూ.10 కోట్లు.
క్రీడాకారుల సంక్షేమం
——————————
అంతర్జాతీయ క్రీడాకారులకు ప్రోత్సాహం పెంపు, ఒలంపిక్ విజేతలకు నజరానాలు, సానియామీర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, క్రీడా విధానాల రూపకల్పనకు చర్యలు, ఎవరెస్ట్ విజేతలకు నగదు ప్రోత్సాహం, ప్రముఖ క్రీడాకారులకు రూ.10వేల పెన్షన్, బడ్జెట్ కేటాయింపులు శాఖల వారీగా.
అవార్డులు, ప్రశంసలు
———————-
అత్యుత్తమంగా పనిచేసే అధికారులు, ఉద్యోగులకు ప్రశం సలు, అవార్డులు, ఆదాయ అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్.
సోర్స్ : ఆంధ్రప్రభ సౌజన్యం నుండి..