గత కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ కోసం ఎదిరు చూస్తున్నమెగా అభిమానులకు శుభవార్త.. ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. కొణిదెల కంపెనీ ప్రొడక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించాడు.ఈ చిత్రంలో చిరంజీవి పక్కన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, మరో పాత్రలో ప్రగ్యా జైశ్వాల్, అతిథిగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ తదితరులు కూడా కీలక పాత్రధారులేనని చిత్ర టీమ్ ఇప్పటికే ప్రకటించింది.
The moment has arrived. Here we begin #SyeRaaNarasimhaReddy!! Join us & say #SyeSyeRaa
Posted by Konidela Production Company on Tuesday, 5 December 2017