సైమా వేదికపై తన తాజా చిత్రం ‘హలో’ మూవీలోని ‘ఏవేవో కలలు కన్నా అనే పాట పాడి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు అక్కినేని వారసుడు అఖిల్. అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ సమర్పణలో ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘హలో’. అఖిల్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులను, సినీ ప్రేక్షకులను హలోఅంటూ డిసెంబర్ 22న పలకరించబోతున్నారు అఖిల్ అక్కినేని.
అఖిల్‌తో సినిమా అనుకున్నపుడు విక్రమ్ మూడు నాలుగు కథలు చెప్పాడు. ‘హలో’ కథ కాకుండా అంతకు ముందు మరో కథ అనుకున్నాం. దానిపై ఒక నెల రోజుల పాటు విక్రమ్ చతీ చేశాడు. తర్వాత అతనే వచ్చి ఒక పార్ట్ వచ్చిన తర్వాత స్టోరీ మూవ్ అవ్వడం లేదు అన్నాడు. ఆయన చెప్పిన ‘హలో’ స్టోరీ నచ్చేయడంతో సినిమా మొదలైంది అని నాగార్జున తెలిపారు. డిసెంబర్ మాకు సెంటిమెంట్ డిసెంబర్లో సినిమా విడుదల చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. డిసెంబర్ మా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చే నెల. నాన్నగారి కాలం నుండే మాకు ఈ నెల బాగా కలిసొస్తొంది. అదే విధంగా డిసెంబర్ 22న క్రిస్మస్ సీజన్ మొదలవుతుంది. హాలిడేస్ వస్తాయి. న్యూఇయర్ టైమ్ లో మరో నాలుగు హాలిడేస్ వస్తాయి. అందుకే ఇదే రైట్ టైమ్ అని రిలీజ్ చేస్తున్నాం… అని నాగార్జున తెలిపారు.
అఖిల్‌లో స్టంట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. పాటలు పాడుతాడు. మాకు అవి తెలియవు. స్టంట్స్ కోసం మూడు నెలలు శిక్షణ తీసుకున్నాడు. ఏది చేసినా ది బెస్ట్ గా చేస్తాడు. నచ్చనివి అంటే ప్రొద్దున్నే లెగడు. నేను వెళ్లి లేపాలి. వాడికి వాళ్ల అమ్మ సపోర్టు కూడా. నేనేమైనా అంటే 23 ఏళ్ల వయసులో నువ్వు కూడా ఇలాగే చేశావని వెనకేసుకొస్తుంది…. అని నాగార్జున తెలిపారు. హలో హలో మూవీ ద్వారా ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కళ్యాణి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ చిత్రంలో జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
