Home / ANDHRAPRADESH / కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో వజ్రాలు, వైఢ్యూర్యాలు, బంగారం

కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో వజ్రాలు, వైఢ్యూర్యాలు, బంగారం

గుప్తనిధుల వేటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో పెద్ద మొత్తంలో గుప్తనిధులు ఉన్నట్లు కొంతమంది ఇచ్చిన నివేదిక మేరకు తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా కోటలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ తవ్వకాల్లో నిధి ఉన్న ప్రదేశాన్ని అధికారులు గుర్తించినట్టు సమాచారం. గత ఐదు రోజులుగా భారీ యంత్రాల సాయంతో తవ్వకాలు సాగించిన గనులు భూగర్భ శాఖ అధికారులు నిధి ప్రదేశాన్ని కనుగొన్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాదు మరి కాసేపట్లో దీనిపై ఓ స్పష్టత వస్తుందని అంటున్నారు. మరి కొద్ది గంటల్లోనే నిధి ఉన్న ప్రాంతంలో ఏముందనే విషయం తెలుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. గుత్తి రాజులతో యుద్ధం సమయంలో చెన్నంపల్లి రాజులు తమ నిధిని, చెన్నంపల్లి కోటలోనే భద్రపరిచారని ఈ ప్రాంతంలో కథలు ప్రచారంలో ఉన్నాయి.

వజ్రాలు, వైఢ్యూర్యాలు, బంగారాన్ని ఈ కోట లోపల దాచి, దానిపై సీసం పోశారని స్థానికులు నమ్ముతారు. ఇక్కడ భారీ వర్షాలు కురిసిన సమయంలో వజ్రాల కోసం వేట సాగిచండం, కొంత మందికి వజ్రాలు దొరికినట్టు వార్తలు రావడం విదితమే. అనేకసార్లు ఇక్కడ అక్రమ తవ్వకాలు కూడా జరిగాయి. ప్రస్తుతం మాత్రం అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మెటల్ డిటెక్టర్ల సాయంతో ప్రభుత్వమే స్వయంగా నిధిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో స్పష్టత రావడంతో ఉన్నతాధికారులు చేరుకుని, కోట చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు.

కర్నూలు జిల్లా ఉన్నతాధికారులతో పాటు అమరావతి నుంచి కూడా పలువురు అధికారులు ఈ ప్రాంతానికి ఇప్పటికే చేరుకున్నారు. గుర్తింపు పొందిన అధికారులు మినహా మరెవరినీ కోటలోకి అనుమతించడం లేదు. పరిసర ప్రాంతాలు ప్రజలు సైతం కోట వద్దకు భారీగా చేరుకుని, ఏం జరుగుతుందోనన్న విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. కోట లోని ఓ గది కింద దాదాపు 20 అడుగుల లోతున ఉన్న రహస్య సొరంగాన్ని కనిపెట్టిన అధికారులు, ఇప్పుడు అది ఎక్కడకు దారి తీస్తుందోనన్న విషయాన్ని స్కానర్ల సాయంతో పరిశీలిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat