వైజాగ్ లో శ్రీలంక వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు 44.5 ఓవర్లకు 215 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత్ విజయం సాధించాలంటే 216 పరుగులు చేయాల్సి ఉంది. శ్రీలంక బ్యాట్స్ మెన్లు ఉపుల్ తరంగ 95 పరుగులు, సమర విక్రమ 42 పరుగులు చేయగా, మాథ్యూస్, గుణరత్నెలు 17 పరుగుల చొప్పున చేశారు. భారత్ బౌలర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ లు మూడు వికెట్ల చొప్పున తీయగా, హార్ధిక్ పాండ్యా రెండు వికెట్లు, బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లు ఒక్కొక్కటి చొప్పున వికెట్లను పడగొట్టారు.
