వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి జగన్ పాదయాత్రను పక్కదారి పట్టించడానికి అధికార టీడీపీ గుంటనక్క పనులు చేస్తున్నారు. దీంతో జగన్‌తో సహా వైసీపీ నేతలందరూ.. టీడీపీ బ్యాచ్ పుంగి బజాయిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ ఎమ్మెల్చే రోజా చంద్రబాబు బ్యాచ్ మొత్తానికి దిమ్మతిరిగే కౌంటర్ వేశారు. రోజా మాట్లాడుతూ జగన్ కనుక ఒక్క సైగ చేస్తే.. టీడీపీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పి టీడీపీ వర్గీయులు మొత్తానికి షాక్ ఇచ్చింది.
అధికార టీడీపీ నుండి వైసీపీలోకి రావటానికి చాలా మంది సిద్దంగా ఉన్నారని.. అందుకు మా అధినేత జగన అన్నే అంగీకరించడం లేదని రోజా పెద్ద బాంబే పేల్చారు. వైసీపీలోకి రాదలచుకున్న వాళ్ళు ఎవరైనా అభ్యంతరం లేదని కాకపోతే ముందుగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయాల్సిందే అన్న జగన్ పెట్టిన ఒక్క కండీషన్ వల్లే చాలామంది టీడీపీ నేతలు వెనకడుగు వేస్తున్నారని రోజా స్పష్టం చేసారు. జగన్ గనుక రాజీనామా కండీషన్ పెట్టకపోతే ఈపాటికే టీడీపీ సగం ఖాళీ అయిపోయేదన్నారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయానికి మాత్రం టీడీపీ మొత్తం ఖాళీ అవ్వక తప్పదని రోజా జోస్యం చెప్పారు.